సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘జయమ్మ పంచాయితీ’ దర్శకుడి కొత్త సినిమా.. నవంబర్ 27న ‘బాల 369’ విడుదల!

ABN, Publish Date - Nov 14 , 2026 | 11:11 AM

సుమ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జయమ్మ పంచాయితీ’ దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు తెరకెక్కించిన కొత్త చిత్రం ‘బాల 369’. ఆర్విన్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకుంటోంది. నవంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది.

Bala 369 Movie

ప్రముఖ యాంకర్‌ సుమ టైటిల్‌ రోల్ ప్లే చేసిన 'జయమ్మ పంచాయితీ' చిత్రం విడుదలై నాలుగేళ్ళు గడిచిపోయింది. కమర్షియల్‌గా విజయం సాధించని ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు మాత్రం పొందింది. ఆ మూవీని తెరకెక్కించిన విజయ్‌ కుమార్‌ కలివరపు ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఆర్విన్‌ తేజ్‌ హీరోగా, ఎల్లయ్యతో కలిసి విజయ్‌ కుమార్ కలివరపు స్వీయ దర్శకత్వంలో 'బాల 369' అనే సినిమాను నిర్మించాడు. 'అనిజని కంచె' అనేది ఈ సినిమా ట్యాగ్‌ లైన్‌. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.


ఆర్విన్ తేజ్‌తో పాటు వెన్నెల కిషోర్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సమీరా భరద్వాజ్, జీవన్ పాత్రల చుట్టూ కథను నడిపించిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉంది. దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు పాత్రలను, సన్నివేశాలను చాలా నేచురల్‌గా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటోంది. కామెడీని సహజంగా చూపిస్తూ టీజర్ ఆద్యంతం వినోదాన్ని పంచుతోంది.

ఈ చిత్రానికి అనుష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, డా. శాండీ సి. ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తికేయన్ రోహిణి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. 'బాల 369' చిత్రం నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

Gondhal Review: ఆస్కార్ అఫీషియ‌ల్ ఎంట్రీ.. 'గోంధ‌ల్' మూవీ తెలుగు రివ్యూ

Maya Lady Movie Review: మాయ లేడి ఎలా ఉందంటే...

DNK Review: మౌళి తనూజ్‌.. డీఎన్‌కే సినిమా రివ్యూ!

Itlu Arjuna Review: 'ఇట్లు అర్జున' ఎలా ఉందంటే

Goat Movie Review: సుడిగాలి సుధీర్‌ గోట్‌ మూవీ రివ్యూ

Updated Date - Nov 14 , 2026 | 12:47 PM