సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Babu Mohan: బ్లడ్ రోజస్.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది

ABN, Publish Date - Feb 04 , 2026 | 12:03 PM

ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లడ్ రోజస్’ .

Blood Roses

టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నాగన్న, కె. లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా, ఎల్లప్ప కో–ప్రొడ్యూసర్‌గా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లడ్ రోజస్’ (Blood Roses) ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఎంజిఆర్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘బ్లడ్ రోజస్’ ట్రైలర్‌ను నటుడు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించగా, ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్‌కు ప్రముఖ నటుడు బాబు మోహన్ (Babu Mohan) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. 'బ్లడ్ రోజస్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. దర్శకుడు ఎంజిఆర్‌, నిర్మాత హరీష్ కమర్తి‌తో పాటు ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్‌కు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలి' అని అన్నారు.

ఈ చిత్రంలో శ్రీలు, క్రాంతి కిల్లి కీలక పాత్రల్లో నటించగా, సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదీశ్వరి, మణి కుమార్, ధ్రువ, అనిల్, నరేంద్ర, ప్రగ్యా, నవిత, జబర్దస్త్ జీఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, మమత రెడ్డి, జ్యోతి, ఆచార్యలు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించ నున్నారు. క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘బ్లడ్ రోజస్’ ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజ్ చేసేలా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందినట్లు దర్శకుడు ఎంజిఆర్ తెలిపారు.

Updated Date - Feb 04 , 2026 | 12:23 PM