'ఇరుముడి'కి జనాల జాతర.. ట్రాక్టర్లతో గుంపులు గుంపులుగా థియేటర్లకు
ABN , Publish Date - Sep 05 , 2026 | 10:23 AM
తెలుగు చిత్రసీమలో అరుదుగా కనిపించే ఓ ప్రత్యేక దృశ్యం ప్రస్తుతం రవితేజ (Ravi Teja) ‘ఇరుముడి’ (Irumudi) సినిమా థియేటర్ల వద్ద కనిపిస్తోంది.
తెలుగు చిత్రసీమలో అరుదుగా కనిపించే ఓ ప్రత్యేక దృశ్యం ప్రస్తుతం రవితేజ (Ravi Teja) ‘ఇరుముడి’ (Irumudi) సినిమా థియేటర్ల వద్ద కనిపిస్తోంది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో కనిపించే సందడి, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ల వద్ద కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ట్రాక్టర్లలో గుంపులుగా సినిమా చూడడానికి థియేటర్లకు క్యూ కట్టడం ఇప్పుడు సర్వత్రా సినీ లవర్స్‌ను, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రాక్టర్ల ర్యాలీలు, థియేటర్ల వద్ద కనిపిస్తున్న భారీ జనసందోహం చూస్తుంటే ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఎంత లోతుగా స్థానం సంపాదించుకుందో అర్థమవుతోంది. ఒక మంచి కథ ప్రేక్షకులను ఎంత దూరమైనా ప్రయాణించేలా చేస్తుందనే విషయాన్ని ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా ఇరుముడి సినిమాలోని తండ్రి కూతురు ఎమోషన్, పాటలు మారుమూల ఊరి జనాలకు కూడా రీచ్ అవడంతో వారు ఇప్పుడు కుటుంబాలు, కుటుంబాలు థియేటర్ల బాట పట్టాయి.
గతంలో బలగం, మన శంకర వర ప్రసాద్ సినిమాల విషయంలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించగా మరలా ఇప్పుడు అలాంటి ఘట్టాలే రిపీట్ అవుతున్నాయి. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తవుతున్నా ఇంకా అనేక ప్రాతాలలో చాలామంది ప్రజలు ఏదో జాతరకు పోతున్నాం అనే తరహాలో తరలి వస్తుండడంతో థియేటర్లు కళకళలాడి పోతున్నాయి. ప్రస్తుతం పరిస్తితి చూస్తుంటే అటు ఇటు దసరా వరకు థియేటర్ల వద్ద ఈ చిత్రం హంగామా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇరుముడి సినిమాకు పోటీగా వచ్చిన భారీ సినిమాలకు సైతం ఎదురొడ్డి నిలబడడమే గాక వాటిని మించి కలెక్షన్లు సైతం రాబడుతూ ఔరా అనిపిస్తుంది. దీంతో మేకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్‌ను సైతం మరి కొంత కాలం పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.