సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అయోధ్యలో అర్జున్ సర్జా కొత్త సినిమా ప్రారంభం.. నవంబర్ 27న టైటిల్ ప్రకటన!

ABN, Publish Date - Nov 26 , 2026 | 10:14 AM

అర్జున్ సర్జా దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా దేశభక్తి చిత్రం తెరకెక్కనుంది. నవంబర్ 27న అయోధ్యలో ఈ సినిమా ప్రారంభం కానుండగా, అదే రోజు టైటిల్‌ను ప్రకటించనున్నారు.

Arjun Sarja New Movie

నటుడిగానే కాదు దర్శకుడిగానూ అర్జున్ సర్జాకు చక్కని పేరుంది. దేశభక్తిని ప్రేరేపించే చిత్రాలతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం కట్టే చిత్రాలను తెరకెక్కించడానికి అర్జున్ సర్జా ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన 'సీతాపయనం' అలాంటి చిత్రమే. గోరక్షణ, ఉమ్మడి కుటుంబ విలువలను గురించి ఆయన ఆ చిత్రంలో ప్రస్తావించారు. తాజాగా అర్జున్ దర్శకత్వంలో మరో చిత్రం రూపుదిద్దుకోబోతోంది. నవంబర్ 27న ఈ సినిమా శ్రీరామ జన్మభూమి అయోధ్యలో లాంఛనంగా ప్రారంభం కానుంది. అదే రోజున ఈ సినిమా పేరును ప్రకటించబోతున్నారు. అర్జున్ సర్జా ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా ప్రెసిడెన్షియల్‌ మూవీస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ పై అననూప్‌ మోహన్‌ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.


అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా రూపొందనున్న ఈ దేశ‌భ‌క్తి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ జన్మభూమి అయోధ్య‌ ఆలయంలో సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలవనుందని టీమ్ వెల్ల‌డించింది. బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగస్వాములు కానున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలోని పలువురు ప్రముఖులతో కూడిన భారీ పాన్ ఇండియా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. అనూప్ మోహ‌న్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి జోస్ ఎం. థామస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. బలమైన కథాంశం, ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగం, భారతదేశ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నారు. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌లో రూపొంద‌నున్న మూడ‌వ చిత్రమిది.

ఇవి కూడా చదవండి:

ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?

బాలయ్య కూతురు సినిమా.. హీరో ఎవరో తెలుసా

ఆయనలా సీఎం అవుతా.. శర్వానంద్ ఏంటి అలా అనేశాడు

Updated Date - Nov 26 , 2026 | 10:24 AM