ఆయనలా సీఎం అవుతా.. శర్వానంద్ ఏంటి అలా అనేశాడు

ABN , Publish Date - Nov 25 , 2026 | 02:46 PM

భోగి మ్యూజికల్ సెలబ్రేషన్స్‌లో యంగ్ హీరో శర్వానంద్ చేసిన సీఎం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ ప్రస్తావనతో ఆయన రాజకీయాల్లోకి వస్తాడా అంటూ చర్చ మొదలైంది.

Sharwanand

ప్రస్తుతం సోషల్ మీడియాలో యంగ్ హీరో శర్వానంద్ పేరు మారుమ్రోగిపోతుంది. ఏ ముహూర్తన శర్వా భోగి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడో అప్పటినుంచి ఆయన పేరే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, మ్యూజికల్ సెలబ్రేషన్స్.. ఇలా ప్రతిదాంట్లో కూడా శర్వా హైలైట్ గా నిలుస్తున్నాడు.మొన్నటికి మొన్న శర్వా, డింపుల్ కొంచెం చనువుగా ఉండడంతో.. వారిద్దరి గురించి సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. శర్వాకి పెళ్లి అయ్యిందా.. డింపుల్ కి పెళ్లి అయ్యిందా అంటూ డిబేట్ లు నడిచాయి. అలా శర్వా ట్రెండింగ్ లో నిలిచాడు. ఇక ఇప్పుడు మరోసారి ఈ కుర్ర హీరో ఎక్స్ లో రచ్చ చేస్తున్నాడు.


గతరాత్రి జరిగిన భోగి మ్యూజికల్ సెలబ్రేషన్స్ లో శర్వా.. సీఎం అవుతానేమో అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఈ వేడుకలో దర్శకుడు సంపత్ నందిపై శర్వానంద్ ప్రశంసలు కురిపించాడు. కొత్త నటీనటులు, టెక్నీషియన్లకు అవకాశం ఇచ్చారని, 37 సినిమాలు చేసిన హీరోగా కాకుండా ఈ పాత్రను శర్వా చేయగలడని నమ్మి అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి సంపత్ అని చెప్పుకొచ్చాడు. అలాగే సింగర్ నర్సన్నతో సరదాగా మాట్లాడుతూ.. 'మీ పాటతో మీరు చాలా మందిని సీఎం చేశారంట, నన్ను కూడా చేస్తారా ఏంటి? విజయ్ లాగా చెప్పలేం కదా' అని శర్వా అనడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత వెంటనే.. వద్దు.. మనం ఇలాగే ఉందాం. యాక్టింగ్ లోనే బావుంది అని ఈ కుర్ర హీరో మాట దాటేసినా.. ఎప్పుడు లేనిది శర్వా అంతా మాట అనేశాడు ఏంటి అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.


ఇండస్ట్రీలో హీరోలుగా స్టార్ హోదాలో ఉంటూనే ఇంకోపక్క రాజకీయాల్లో కూడా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నవారు చాలామంది ఉన్నారు. విజయ్ లా అనడంతోనే శర్వా కూడా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని కొందరు చెప్పుకొస్తున్నారు. కానీ, శర్వా ఏదో జోక్ గా అన్నాడు అంతే, దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా శర్వానంద్ ఇలా యాక్టివ్ గా మాట్లాడడం అనేది ఫ్యాన్స్ కి చాలా కొత్తగా అనిపిస్తుందని, బైకర్ కి ముందు అసలు శర్వా చాలా తక్కువ మాట్లాడేవాడని.. ఇప్పుడు చాలా యాక్టివ్ గా మారడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. ఎలాగైనా శర్వా చలాకీతనంతో భోగి సినిమాకి హైప్ మాత్రం వచ్చేసింది. మరి ఈ సినిమాతో ఈ కుర్ర హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మహేశ్ బాబుకు డై-హార్డ్ ఫ్యాన్ అంటే ఈ చిన్నారే..

‘భోగి’ ప్రమోషన్స్‌.. డింపుల్ కోసమే అనుపమని పక్కన పెట్టారా?

ధర్మేంద్ర మొదటి వర్ధంతి.. హేమమాలిని ఎమోషనల్ పోస్ట్

Updated Date - Nov 25 , 2026 | 03:35 PM