చిరంజీవి వారసుడిలా నా వారసుడు కూడా ఎదగాలి: ఏఆర్ రెహమాన్
ABN, Publish Date - Jun 01 , 2026 | 12:23 AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ (Peddi) దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమైంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్‌లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి (Chiranjeevi) బిగ్గెస్ట్ స్టార్. ఆయన స్థాయిని అందుకోవడం అంత తేలిక కాదు. అయితే ఆయన కుమారుడిగా రామ్ చరణ్ కొత్త ప్రమాణాలను నెలకొల్పి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఐడెంటిటీ, ఇమేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ ఆయన వారసత్వాన్ని ఘనంగా నిలబెట్టాడు రామ్ చరణ్. నా వారసుడు కూడా సంగీతంలో ఇలానే ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, థమన్ వంటి అద్భుతమైన సంగీత దర్శకులు ఉన్న పరిశ్రమలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథను బుచ్చిబాబు చెప్పినప్పుడు నాకు చాలా స్ఫూర్తిగా అనిపించింది. చాలా మంచి కథ, మట్టి కథ ఇది. ఈ చిత్రానికి పని చేయడం ఎంతో ఎంజాయ్ చేశాను. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్‌పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!
Nbk: బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా.. మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
రానాతో కలిసి రామ్ చరణ్ చేసిన ఈ తుంటరి పనులు తెలుసా?