సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

APSFTVTDC చైర్మన్, డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం.. హీరో శివాజీ గైర్హాజరు

ABN, Publish Date - May 24 , 2026 | 07:00 PM

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం బాధ్యతలను స్వీకరించారు. ఆదివారం, విజయవాడలో కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.

APSFTVTDC Oath Ceremony

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC)కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం బాధ్యతలను స్వీకరించారు. ఆదివారం, విజయవాడలో కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ (Kandula Durgesh) సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన వారిలో శివాజీ (Sivaji) మినహా అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. హీరో శివాజీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. సోమవారం డైరెక్ట్‌గా ఆయన ఫైల్లో సైన్ చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ది కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఏర్పాటైందని, రాష్ట్ర విభజన అనంతరం 2017లో ఆంధ్రప్రదేశ్‌లో అంబికా కృష్ణ ఆధ్వర్యంలో ఎఫ్‌డీసీ ఏర్పాటు చేశారన్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నా.. అంబికా కృష్ణ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం ఎఫ్‌డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్‌తో పాటు కొత్త కమిటీని ఏర్పాటు చేశారని, రెండు రాష్ట్రాల్లో ఎఫ్‌డీసీలు ఉన్నా.. అందరూ కలిసే పని చేస్తారని అన్నారు. నాడు, నేడు విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా ఉంటుందన్నారు. ఏ చిత్రానికైనా 70 శాతం కలెక్షన్లు ఏపీ నుంచి వసూళ్లు అవుతాయని పేర్కొన్నారు. రాజమండ్రి, అరకు, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో అనేక సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయని, నూతనంగా ఎన్నికైన కమిటీ టీవీ, థియేటర్, చలన చిత్ర పరిశ్రమల అభివృద్దికి కృషి చేయాలని కోరారు.


ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఎన్నికైన సభ్యులు వీరే..

చైర్మన్: పి. భరత్ భూషణ్

డైరెక్టర్లు:

1. మెహర్ రమేష్

2. సుమన్ తల్వార్

3. ఎస్. శివాజీ

4. చదలవాడ శ్రీనివాసరావు

5. బుర్రా సాయిమాధవ్

6. వై. ఝాన్సీ

7. కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద (వివేక్ కూచిభొట్ల)

8. వి. సముద్ర

9. కె. ఉమామహేశ్వర రావు (సీనియర్ జర్నలిస్ట్)

10. మీర్. ఎస్

11. కందిమళ్ల సాంబశివరావు (చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, రచయిత)

12. ఎస్. వెంకట కృష్ణారెడ్డి

13. జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్

14. డి. సత్యనారాయణ

ఇవి కూడా చదవండి:

జ‌స్‌ప్రీత్ బుమ్రాకు సారీ చెప్పిన రామ్‌చ‌ర‌ణ్.. అసలు విషయమిదే!

అల్లు అయాన్‌కు ఆర్‌సీబీ ప్లేయర్ స్పెషల్ గిఫ్ట్.. బన్నీ పోస్ట్ వైరల్!

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

Updated Date - May 24 , 2026 | 07:31 PM