సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

APSFTVTDC చైర్మన్‌గా భరత్ భూషణ్.. వైస్ చైర్మన్‌గా మెహర్ రమేష్

ABN, Publish Date - May 21 , 2026 | 10:23 PM

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) చైర్మన్ విషయంలో ఇటీవల ఎలాంటి వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. దీనిపై ఓ కాంట్రవర్సీనే నడిచింది. ఇప్పుడీ కాంట్రవర్సీకి తెరపడింది.

APSFTVTDC New Team

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) చైర్మన్ విషయంలో ఇటీవల ఎలాంటి వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. దీనిపై ఓ కాంట్రవర్సీనే నడిచింది. చైర్మన్‌గా భరత్ భూషణ్ ఎన్నికయ్యారనేలా వార్తలు రావడంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో అంతర్గత విభేదాలు చెలరేగాయి. ఇక ఆ విభేదాలకు చెక్ పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిల్మ్ టీవీ థియేటర్ అభివృద్ధి సంస్థ చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పి. భరత్ భూషణ్ (P. Bharat Bhushan) పేరునే ప్రకటించింది. వైస్ చైర్మన్‌గా దర్శకుడు మెహర్ రమేష్ (Meher Ramesh) పేరును ప్రకటించారు. వీరితో పాటు మరో 14 మంది డైరెక్టర్లను నియమిస్తూ వారి పేర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.


14 మంది డైరెక్టర్స్‌లో సీనియర్ హీరో సుమన్, హీరో శివాజీ.. సినీ రచయిత, తెనాలి కళల కాణాచి పరిషత్ నిర్వాహకులు బుర్రా సాయి మాధవ్, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, వివేక్ కూచిభొట్ల, నటి ఝాన్సీ, దర్శకులు వి. సముద్ర, ఎస్.వి. కృష్ణారెడ్డి వంటి వారికి చోటు కల్పించారు. ఇకపై టీవీ, సినిమా నంది అవార్డులు, నంది నాటకోత్సవాలన్నీ ఈ కమిటీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా, టీవీ షూటింగులు జరిగేందుకు.. సినీ, టీవీ, రంగస్థల కళాకారుల అభివృద్ధికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నూతన టీమ్‌కు ఆదేశించారు.


ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఎన్నికైన సభ్యులు వీరే..

చైర్మన్: పి. భరత్ భూషణ్

వైస్ చైర్మన్‌: దర్శకుడు మెహర్ రమేష్

డైరెక్టర్లు:

1. సుమన్ తల్వార్

2. ఎస్. శివాజీ

3. చదలవాడ శ్రీనివాసరావు

4. బుర్రా సాయిమాధవ్

5. వై. ఝాన్సీ

6. కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద (వివేక్ కూచిభొట్ల)

7. వి. సముద్ర

8. కె. ఉమామహేశ్వర రావు (సీనియర్ జర్నలిస్ట్)

9. మీర్. ఎస్

10. కందిమళ్ల సాంబశివరావు (చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, రచయిత)

11. ఏ. సత్యనారాయణ

12. ఎస్. వెంకట కృష్ణారెడ్డి

13. జి. రాజ్ వెంకటేశ్వర యాదవ్

14. డి. సత్యనారాయణ

ఇవి కూడా చదవండి:

‘లవ్ యూ కళ్యాణ్’.. మెగా158 లాంచ్‌పై చిరు ట్వీట్ వైరల్!

Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

Updated Date - May 21 , 2026 | 10:24 PM