సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan Kalyan: సింగీతం శ్రీనివాసరావు మృతి.. పవన్‌ కల్యాణ్‌ తీవ్ర సంతాపం

ABN, Publish Date - Oct 04 , 2026 | 08:08 AM

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారన్న వార్తపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (singeetam Srinivasa Rao) కన్నుమూశారన్న వార్తపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Apdcm Pawan kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ.. సింగీతం శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భారతీయ చలన చిత్ర పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు విభిన్నమైన చిత్రాలను అందించారని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’, ‘మయూరి’, ‘ఆదిత్య 369’, ‘మైకేల్‌ మదన కామరాజు’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన ప్రయోగాలు, చూపిన సృజనాత్మకత ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని గుర్తుచేశారు. అలాగే ‘అమెరికా అమ్మాయి’, ‘పంతులమ్మ’ వంటి చిత్రాల్లోని గీతాలు కూడా విశేష ప్రజాదరణ పొందాయని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్‌ గీతం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా ఆయనకు సినిమాపై ఉన్న అంకితభావం, ఆసక్తి స్పష్టమవుతాయని అన్నారు. సింగీతం శ్రీనివాసరావు మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు పవన్‌ కల్యాణ్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ALSO READ:

చిత్రసీమలో తీవ్ర విషాదం: సీనియర్ దర్శకుడు సింగీతం మృతి


భారతీయ సినిమాకు తీరని లోటు: నందమూరి బాలకృష్ణ


వైవిధ్య చిత్రాల రూపశిల్పి... సింగీతం!


Updated Date - Oct 04 , 2026 | 08:53 AM