సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఫంకీ నుంచే ఇంకా కోలుకోలేదు.. అప్పుడే ఇంకొకటా

ABN, Publish Date - May 10 , 2026 | 03:42 PM

జాతిరత్నాలు సినిమాతోతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ (Anudeep KV). ఈ సినిమా తరువాత ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు అనుదీప్.

Nithiin

జాతిరత్నాలు సినిమాతోతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ (Anudeep KV). ఈ సినిమా తరువాత ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు అనుదీప్. అయితే ఆ సినిమా అనంతరం ఇప్పటివరకు అలాంటి హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు. తన ప్రత్యేక కామెడీ స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్ ఈ మధ్యనే ఫంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్ సేన్ తో కామెడీ పండించాలని ట్రై చేసి విఫలమయ్యాడు. మీమ్స్, కుళ్ళు జోకులు తప్ప ఆ సినిమాలో స్టోరీ లేదు అని ప్రేక్షకులు పెదవి విరిచారు.


ఇక ఫంకీ తరువాత అనుదీప్ మరో కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఈ డైరెక్టర్ కుర్ర హీరో నితిన్ తో కామెడీని పండించాలని ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే నితిన్ కి కథ వినిపించగా.. ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను తెరకెక్కించనుంది.


ఇక నితిన్ విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి కథల ఎంపికలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, కొత్త తరహా స్క్రిప్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు టాక్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. అయితే ఈసారి కేవలం కామెడీపై కాకుండా, బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనుదీప్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ .. ఫంకీ నుంచే ఇంకా కోలుకోలేదు.. మళ్ళీ ఇంకొకటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నితిన్ - అనుదీప్ కామెడీ ఈసారి పడుతుందేమో చూడాలి.

Updated Date - May 10 , 2026 | 03:48 PM