సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నేనెప్పుడు చెప్పాను.. సినిమాలకు గుడ్‌బై వార్తలపై అను స్పందనిదే

ABN, Publish Date - Sep 17 , 2026 | 07:13 PM

నేచురల్ స్టార్ నాని నటించిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలైతే వచ్చాయి కానీ, హిట్ మాత్రం రాలేదు.

Anu Emmanuel

నేచురల్ స్టార్ నాని నటించిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది మలయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel). తొలి సినిమాతోనే తన అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ బ్యూటీ.. అనతికాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘అజ్ఞాతవాసి’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) సరసన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. అయితే, గత కొంతకాలంగా ఆమె వెండితెరకు దూరంగా ఉండటంతో.. అను ఇమ్మాన్యుయేల్ సినిమాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పబోతోందంటూ నెట్టింట, సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం మొదలైంది.


ఈ ప్రచారంపై వాస్తవాలు తెలుసుకునేందుకు ఆమెను నేరుగా సంప్రదించగా.. ఈ రూమర్స్‌పై అను గట్టిగానే స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘‘నో నో.. నేను సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. ఎప్పటికీ అలా చెప్పను. ఈ వదంతులను ఎవరు పుట్టించారో తెలియదు కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. నేను ఇండస్ట్రీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మంచి వైవిధ్యమైన కథలు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల కోసమే ఎదురుచూస్తున్నాను. త్వరలోనే నా తదుపరి చిత్రాలకు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌లను ప్రకటిస్తాను’’ అని స్పష్టం చేశారు. దీంతో తన కెరీర్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాలకు ఆమె ఒక్క మాటతో పుల్‌స్టాప్ పెట్టేశారు.


అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలో టాలెంట్‌తో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి రావాలంటారు. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాలు దక్కినప్పటికీ, ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించకపోవడంతో ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది. అవకాశాలు తగ్గడంతోనే ఆమె గుడ్‌బై చెబుతోందంటూ కొందరు పనిగట్టుకుని రూమర్స్ సృష్టించారు. అయితే, సరైన ఒక్క సాలిడ్ హిట్ పడితే మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అను ఇచ్చిన ఈ తాజా వివరణతో స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి:

‘వారణాసి’ నుంచి క్రేజీ అప్‌డేట్.. జక్కన్న మాస్టర్ ప్లాన్ అదేనా?

పల్లవి జోషికి సి.బి.ఎఫ్.సి.లో చోటు... విమర్శకులపై విరుచుకుపడ్డ వివేక్ అగ్నిహోత్రి

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రిలీజ్‌పై అనుమానాలు.. అసలు విషయం ఏంటంటే

Updated Date - Sep 17 , 2026 | 07:13 PM