సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anil Ravipudi: రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని వెళ్లిపోయిన అనిల్!

ABN, Publish Date - Nov 22 , 2026 | 01:17 PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన కాంబినేషన్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబో ఒకటి.


టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన కాంబినేషన్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

తాజాగా  దర్శకుడు అనిల్ రావిపూడి  ‘హై’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆ వేదికపై ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో అక్కడున్న వారంతా ఆయన నుంచి ఏదైనా ఆసక్తికరమైన అప్‌డేట్ వస్తుందేమోనని ఎదురుచూశారు. అయితే అనిల్ రావిపూడి మాత్రం తనదైన శైలిలో సరదాగా స్పందించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రెండు చేతులను జేబుల్లో పెట్టుకుని నవ్వుతూ వేదిక దిగిపోయారు. దీంతో అక్కడున్న వారితో పాటు అభిమానుల్లోనూ నవ్వులు పూశాయి. ఆయన ఇచ్చిన ఈ ఫన్నీ రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ సినిమా గురించి అడిగితే అనిల్ ఇలా తప్పించుకున్నారేంటంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

ఈ సినిమా గురించి అనిల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. "మా  కాంబినేషన్ లో సినిమా ఎప్పటి నుంచో రావాల్సి ఉంది. తారక్‌ గారితో కలిసి ఓ ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నాం. సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. లేదు లేదు.. త్వరలోనే నవ్వులతో సందడి చేయబోతున్నాం" అని అనిల్ పేర్కొన్నారు. 

ALSO READ:
Sreeleela: త్వరలోనే.. చాలా గుడ్ న్యూస్‌లు చెబుతా

Keerthy Suresh: ఎవరో అన్న మాటలకు వివరణ ఇచ్చి వారిని సరిదిద్దే రకం కాదు

అప్పుడు.. 'రంగస్థలంలో గోదావరి యాస, 'పుష్ప' చిత్తూరు మాండలికం ఇప్పుడు 'భోగి కి తెలంగాణ యాస‌

Updated Date - Nov 22 , 2026 | 02:01 PM