ప్రారంభం నుంచే హడావుడి చేసే అనిల్ రావిపూడి.. సైలెంట్‌గా సరికొత్త ప్రయోగం!

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:52 PM

ఈ ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ వైపు అడుగులు వేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

Anil Ravipudi

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకులలో రాజమౌళి (SS Rajamouli) తర్వాత ఆ స్థాయి గుర్తింపు పొందిన దర్శకుడు ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి (Anil Ravipudi). తనదైన కామెడీ టైమింగ్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే ఆయనకు ‘హిట్ మిషన్’ అనే బిరుదు కూడా ఉంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) వంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ వైపు అడుగులు వేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా, షూటింగ్ కూడా గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభమైందని సమాచారం.


ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రానికి సంబంధించిన పనులు పూర్తి కాగానే, జూన్ లేదా జూలై నెల నుంచి అనిల్ రావిపూడి సినిమాకు పూర్తి స్థాయి కాల్‌ షీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ లోపు అనిల్ మరో క్రేజీ ప్రాజెక్టుపై తన దృష్టిని సారించారు. గతంలోనే వార్తలు వచ్చినట్లుగా, ఆయన ఒక ప్రతిష్టాత్మక యానిమేటెడ్ చిత్రాన్ని (Animated Movie) తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


ఈ యానిమేటెడ్ ప్రాజెక్టు కోసం అనిల్ ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసుకున్నారట. ‘హనుమాన్, మిరాయ్’ వంటి ఫాంటసీ హిట్లకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన గౌర హరి, ఈ సినిమా కోసం తన పనిని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలతో నిరంతరం చర్చలు జరుపుతున్న అనిల్, తాను మల్టీస్టారర్‌తో పూర్తిగా బిజీ కావడానికి ముందే ఈ యానిమేషన్ పనులను ఒక కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ ప్రాజెక్టులో నటీనటుల ప్రత్యక్ష భాగస్వామ్యం తక్కువ కాబట్టి, డేట్లు సర్దుబాటు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ యానిమేషన్ చిత్రంపై అధికారిక వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ, దీనికి ప్రత్యేకమైన ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అనిల్ రావిపూడి, తన ప్రాజెక్ట్ స్టార్ చేయడంతోనే ప్రమోషన్స్ హడావుడి స్టార్ట్ చేస్తారు. కానీ, ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఆయన సైలెంట్‌గా అన్నీ చేసేస్తుండటం విశేషం.


రామాయణ గాథలోని మొత్తం కథను కాకుండా, శ్రీరాముని జీవితంలోని ఒక కీలక ఘట్టాన్ని ఎంచుకుని, దానిని సరికొత్త కోణంలో ఈ ఫిల్మ్‌లో ఆవిష్కరించబోతున్నారట. ఇది ఇటీవల వచ్చిన ‘మహావతార్ నరసింహ’ తరహాలో ఉంటుందని ఫిలిం నగర్ టాక్. వరుస విజయాల దర్శకుడిగా అనిల్ రావిపూడికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే, కామెడీ లేకుండా సన్నివేశాలను ఊహించలేని అనిల్, ఇటువంటి పౌరాణిక ఘట్టాన్ని ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రామాయణంలోని తీవ్రతను కాపాడుతూ తనదైన శైలిలో వినోదాన్ని జొప్పిస్తారా లేక, పూర్తిగా సీరియస్ నెరేషన్‌కు కట్టుబడతారా? అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, తన తదుపరి చిత్రాలతో అనిల్ బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ

‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!

గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!

సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Apr 10 , 2026 | 04:52 PM

Anil Ravipoodi: మరో ప్రాంఛైజ్‌కు రెడీనా...

Anil Ravipudi : ఆయన గట్స్‌కి హ్యాట్సాఫ్‌.. ఆ మోడ్‌లో ఉంటే ఆయన్ని ఆపలేం.

Anil Ravipudi : రాజకీయ పార్టీ పెడుతున్నానంటూ.. దర్శకుడి వైరల్‌ వీడియో

Anil Ravipudi interview: ‘మెగా 157’తో సర్‌ప్రైజ్‌ ఇస్తా..

Anil Ravipudi: 'బుల్లిరాజు'పై విమర్శలు.. చెక్ పెట్టిన అనిల్ రావిపూడి