Anakapalli: నాగవంశీ విడుదల చేసిన రొమాంటిక్ సాంగ్!
ABN , Publish Date - Jul 15 , 2026 | 05:20 PM
విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన 'అనకాపల్లి' చిత్రం ఆగస్ట్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్, శిరీష దంపతుల కుమారుడు విక్రమ్ సహిదేవ్ నటించిన తాజా చిత్రం 'అనకాపల్లి'. నిజానికి ఈ సినిమా జూన్ 5న విడుదల కావాల్సింది. కానీ అదే సమయంలో జూన్ 4న 'పెద్ది' రావడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా ఆగస్ట్ 7న జనం ముందుకు రాబోతోందని మేకర్స్ తెలిపారు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడుతో కలిసి 'అనకాపల్లి' సినిమాను నిర్మించారు. దీనికి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించి, ఓ ముఖ్యపాత్రను కూడా పోషించారు. రా అండ్ రస్టిక్ మూవీగా దీనిని ఖగేష్ తమ్మినేని తెరకెక్కించారు.

తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘ఎలగే పిల్ల’ అనే పాటను రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. పాట క్యాచీగా ఉందని, లిరికల్ వీడియోలో విజువల్స్, హీరో వేసిన స్టెప్పులు బాగున్నాయని చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, కపిల్ కపిలాన్, దేవజండ్ పాడారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘అమ్మోరు దిగినాది’, ‘లబ్బరు బొమ్మ’ పాటలు విడుదలై, యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.
ఇవి కూడా చదవండి:
నిన్న తండ్రితో... రేపు కొడుకుతో... నయన్ నట విన్యాసం!
పోసాని భార్యను బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా
రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల