‘అనకాపల్లి’.. గాంధీ జయంతికి రా అండ్ రస్టిక్ వినోదం

ABN , Publish Date - Sep 30 , 2026 | 08:22 PM

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన రా అండ్ రస్టిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అనకాపల్లి’. గాంధీ జయంతికి ఈ చిత్రం విడుదలయ్యేందుకు ముస్తాబైంది.

Anakapalli Press Meet

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన రా అండ్ రస్టిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli). భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు త్రినాథరావు ఇందులో కీలక పాత్రలో నటించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించగా.. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో బుధవారం చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకుంది.


ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ సినిమా వాస్తవానికి ఆగస్ట్‌లోనే విడుదల కావాల్సింది. అయితే ముందుగానే చాలామంది సినీ ప్రముఖులకు ఈ సినిమాను చూపించి, వారి సలహాలు, సూచనలు తీసుకుని మరింత బెటర్‌గా తీర్చిదిద్దాం. మా అబ్బాయి విక్రమ్‌కు ఇంత మంచి పాత్ర ఇచ్చిన త్రినాథరావుకు ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మాత నాయుడు తపన, ప్యాషన్ కోసమైనా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. సంధ్య పాత్ర సరికొత్తగా ఉంటుంది. తారక్ పొన్నప్ప తన విలనిజంతో ప్రేక్షకులను భయపెడతాడు. ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్లాక్స్ అద్భుతమైన సర్‌ప్రైజ్‌లతో ఉంటాయి. మ్యూజిక్, రీ-రికార్డింగ్ చాలా బాగా కుదిరాయి. అక్టోబర్ 2న వస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నానని అన్నారు.


దర్శక-నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. సినిమా తీయడం కంటే థియేటర్లకు తీసుకురావడమే ఇప్పుడు మరింత కష్టంగా మారింది. నిర్మాత పడే కష్టం ఏంటో నాకు ఇప్పుడిప్పుడే స్పష్టంగా అర్థమవుతోంది. డైరెక్టర్‌గా ఉండటమే సులభం అనిపిస్తున్నా.. సినిమా నిర్మాణం నా ప్యాషన్ కాబట్టి ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించాను. ఇప్పటికే ఓపెన్ చేసిన చోట్ల బుకింగ్స్ ఫుల్ అవుతుండటం చాలా సంతోషాన్నిస్తోంది. ‘మేం వయసుకు వచ్చాం’ తర్వాత ఇన్నేళ్లకు నేను రాసుకున్న అత్యుత్తమ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఇది. ఇందులోని ఇంటర్వెల్ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు.. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. విక్రమ్ అద్భుతంగా నటించాడు, తనకిది మంచి గుర్తింపు తెస్తుంది. ఇప్పటికే అనకాపల్లిలో సినిమాను ప్రదర్శించగా.. అద్భుతమైన స్పందన వచ్చింది. అక్టోబర్ 2న వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాను.. అని తెలిపారు.

నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ.. విక్రమ్, సంధ్య, తారక్ పొన్నప్ప, సీనియర్ నటి ఇంద్రజ అందరూ పాత్రల్లో ఒదిగిపోయారని, ప్రేక్షకులందరికీ నచ్చే కథాంశంతో ఈ సినిమా రాబోతోందని చెప్పారు. హీరోయిన్ సంధ్యా వశిష్ట మాట్లాడుతూ.. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ యాక్షన్ అంశాలతో కూడిన పరిపూర్ణ చిత్రంగా ‘అనకాపల్లి’ ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

కన్యత్వం చుట్టూ తిరిగే బోల్డ్ కథతో సినిమా.. సమంత బంగారమే స్ఫూర్తట

ఈ వారం మూడు కొత్త సినిమాలు.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి

ఫెడరేషన్ అధ్యక్షుడిపై జానీ మాస్టర్ వైఫ్ సుమలత యుద్ధం మొదలు

Updated Date - Sep 30 , 2026 | 08:22 PM