సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘అమీర్ లోగ్’ ట్రైలర్ చూస్తుంటే.. మంచి బిర్యానీ వాసన వస్తోంది

ABN, Publish Date - Aug 14 , 2026 | 08:47 PM

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Ameer Log Trailer Launch

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ఇతర కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.


ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ (Sai Marthand) మాట్లాడుతూ.. ‘అమీర్ లోగ్’ సాంగ్స్ బాగున్నాయి. టీజర్, ట్రైలర్ నాకు నచ్చాయి. సాయి స్మరణ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. హరి నాకు మంచి మిత్రుడు. రమణా రెడ్డి పెద్ద ఆర్కిటెక్ట్. ఆయన ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీశారు. ఇది చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపించింది. ‘ఫలక్ నుమా దాస్’ రేంజ్‌లో ఈ సినిమా విజయం సాధిస్తుందనిపిస్తోంది. ఆగస్ట్ 21న రాబోతోన్న ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరారు. ‘లిటిల్ హార్ట్స్’ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ఆర్టిస్టులందరూ సహజంగా అనిపిస్తున్నారు. నా మెంటర్ సాయి స్మరణ్. అతని మ్యూజిక్‌కి నేను చాలా పెద్ద ఫ్యాన్. హరి మంచి ఆర్టిస్ట్, సింగర్. ట్రైలర్ చాలా బాగుంది. మంచి బిర్యానీ వాసన వస్తోంది. ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంకరేజ్ చేయండని అన్నారు.


దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ.. ‘అమీర్ లోగ్’ చిత్రం హైదరాబాద్ ప్రజలకు ప్రతీకగా ఉంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ప్రేక్షకులను ఏడ్పిస్తాం, నవ్విస్తాం. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే అందరం ఎంతో కాన్ఫిడెంట్‌గా, సంతోషంగా ఉన్నాం. హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. ‘డాలర్ డ్రీమ్స్’, ‘పెళ్లి చూపులు’, ‘బలగం’ రేంజ్‌లో మా ‘అమీర్ లోగ్’ ఉంటుందని నమ్ముతున్నాను.. అని చెప్పుకొచ్చారు. నిర్మాత మాధవి రెడ్డి సోమ మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదల చేస్తున్న స్పిరిట్ మీడియాకి థాంక్స్. ఆగస్ట్ 21న మా సినిమాని చూసి ప్రేక్షకదేవుళ్లు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ శశి.. నటులు MC హరి, మనోజ్, శశిధర్, వేధ జలంధర్, విశ్వేందర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి స్మరణ్ వంటి వారంతా మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

‘జార్జ్ క్రిష్’.. శ్రీను వైట్లకు శర్వానంద్ అయినా హిట్ ఇస్తాడా

మహేష్ బాబు కాదా.. బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తోనా?

డీపీ మార్చిన రెబల్ స్టార్.. ఇక అంతా ‘ఫౌజీ’ గురించే!

Updated Date - Aug 14 , 2026 | 08:47 PM