సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నన్ను అందరూ గుర్తు పడుతున్నారు: నటి వేధా జలంధర్

ABN, Publish Date - Aug 19 , 2026 | 11:39 PM

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటి వేధా జలంధర్ ఈ చిత్ర విశేషాలకు మీడియాకు తెలియజేశారు

Vedha Jalandhar

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ (Ramana Reddy Soma) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటి వేధా జలంధర్ (Vedha Jalandhar) ఈ చిత్ర విశేషాలకు మీడియాకు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ..

‘‘2019లో నా కెరీర్ ప్రారంభించాను. నేను చేసిన ఓ రెండు సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా వెళ్లాయి. కానీ అవి రిలీజ్ కాలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోసం థియేటర్ కూడా నేర్చుకున్నాను. ‘అమీర్ లోగ్’ సినిమాలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. మహిళలకు స్పూర్తినిచ్చేలా నా పాత్రను దర్శకుడు డిజైన్ చేశారు. ఈ జర్నీలో అమ్మే నాకు స్పూర్తి. ఈ సినిమాలోని పాత్ర కూడా అలానే ఉంటుంది. ముక్కు సూటిగా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది మా అమ్మ నుంచే నేర్చుకున్నాను. ఈ సినిమాలో నేను చేసిన పాత్రలో కూడా ఇలానే ఉంటాను. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చేసినట్టుగా మా దర్శకుడు రమణకు తెలీదు. బషీర్ మాస్టర్ మాకు ఈ మూవీ ఆడిషన్స్ గురించి చెప్పారు. నేను ఆడిషన్‌కి వెళ్లాను. అక్కడ నేను బాగా పర్ఫామ్ చేయడంతో దర్శకుడు వెంటనే ఓకే చెప్పారు.


‘అమీర్ లోగ్’ సినిమా చూసిన వారంతా నా పాత్ర గురించి మాట్లాడుకుంటారు. నా వర్క్ అందరికీ నచ్చుతుంది. నేను చేసింది ఒకటి, రెండు సినిమాలే అయినా అందరూ నన్ను గుర్తు పడుతున్నారు. పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేయాలని అనుకుంటున్నాను. అందుకే ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటున్నాను. ఈ సినిమాలో బిర్యానీది మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కథలో ఆ ఎలిమెంట్ బాగా కుదిరింది. మా చిత్రం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. నేను ఇది వరకే సింక్ సౌండ్‌తో ఓ ఫీచర్ ఫిల్మ్‌కి పని చేశాను. మనం ఎంత ప్రొఫెషనల్‌గా ఉన్నా.. చుట్టు పక్కల ఉన్న సౌండ్స్ కూడా రికార్డ్ అవుతుంటాయి. సెట్‌లో చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రానికి అందరూ అద్భుతంగా సహకరించారు. బస్తీ వాళ్లు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు.


ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి అనే నంబర్ కంటే.. మనల్ని ఆడియెన్స్ ఎంతలా యాక్సెప్ట్ చేశారు.. ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నాం అనేదే ముఖ్యమని నేను భావిస్తాను. అందుకే నా ఈ ఆరేళ్ల జర్నీలో నేను చేసిన పాత్రలు నాకు సంతృప్తినిచ్చాయనే చెబుతాను. మనం చేసిన వాటిలో ఎన్ని రిలీజ్ అవుతాయనేది మన చేతుల్లో ఉండదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు. టెక్నీకల్‌గా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను స్పిరిట్ టీం చూసి అభినందించింది. మా ప్రీమియర్ చూసిన దర్శకుడు విఎన్ ఆదిత్య కూడా చాలా మెచ్చుకున్నారు. ఈ సినిమాకు భాష, యాసతో ఎలాంటి సమస్య రాదు. ఎమోషన్ అనేది అందరికీ కామన్ కాబట్టి, మా చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, అన్ని ప్రాంతాల వారిని మెప్పించేలా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి:

‘మండాడి’.. బాబోయ్! సుహాస్ ఏంటి ఇలా ఉన్నాడు

జానీ, సుమలత మాస్టర్స్‌కు ఫెడరేషన్ షాక్.. ఆ విరాళం రిటన్!

ఫాంటసీ కామెడీ‌తో.. దసరా బరిలోకి యామీ గౌతమ్

Updated Date - Aug 19 , 2026 | 11:39 PM