సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీలోకి వచ్చేసిన ది ఒడిస్సీ.. ట్విస్ట్ ఏంటంటే

ABN, Publish Date - Nov 18 , 2026 | 04:12 PM

తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోన్న ది ఒడిస్సీ (The Odyssey) ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసింది. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండాయా వంటి భారీ తారాగణంటో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన ఈ సినిమా జూలైలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది.

The Odyssey

తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోన్న ది ఒడిస్సీ (The Odyssey) ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసింది. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండాయా వంటి భారీ తారాగణంటో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన ఈ సినిమా జూలైలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందిన ఈ భారీ హిస్టారికల్ డ్రామా, ఐమ్యాక్స్ చరిత్రలోనే రికార్డు వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతేకాకుండా, R-రేటెడ్ విభాగంలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.


థియేటర్ లో రచ్చ రేపిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ది ఒడిస్సీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం రెంటల్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ, అదనంగా కొంత అద్దె చెల్లించి మాత్రమే ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది. ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ఫ్రీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే దానిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.


ఇక ది ఒడిస్సీ కథ విషయానికొస్తే.. ట్రోజన్ యుద్ధంలో తన తెలివితేటలతో ట్రోజన్ హార్స్ వ్యూహాన్ని రచించి గ్రీకులకు విజయాన్ని అందిస్తాడు ఇథాకా రాజు ఒడిస్సియస్. యుద్ధం ముగిశాక తన భార్య పెనెలోప్, కొడుకు టెలిమాకస్ దగ్గరికి తిరిగి వెళ్లడానికి బయలుదేరుతాడు. కానీ, యుద్ధంలో 10 ఏళ్లు గడిపిన ఒడిస్సియస్‌కు ఇంటికి చేరుకోవడానికి మరో 10 ఏళ్లు పడుతుంది. తిరుగు ప్రయాణంలో ఒడిస్సియస్, అతని సైనికులు ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్ పాలిఫెమస్ గుహలో చిక్కుకుంటారు. అతని కన్ను పొడిచి తప్పించుకోవడంతో, ఆ రాక్షసుడి తండ్రి అయిన సముద్ర దేవుడు పొసైడాన్ ఆగ్రహానికి గురవుతారు. పొసైడాన్ శాపం వల్ల ఒడిస్సియస్, అతని సైనికులు ఇంటికి చేరుకున్నారా.. ? ఆ ప్రయాణంలో జరిగిన సంఘటనలు ఏంటి.. ? పెనెలోప్ ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిన దుర్మార్గులు ఎవరు.. ? చివరకు ఒడిస్సియస్ ఏమయ్యాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. ఎలాగూ తెలుగు డబ్బింగ్ ఉంది. ఫ్రీ స్ట్రీమింగ్ వరకు ఆగలేని సినీ ప్రియులు రెంట్ చెల్లించి ఈ సాలిడ్ ఎపిక్ డ్రామాను ఎంజాయ్ చేయవచ్చు.

Updated Date - Nov 18 , 2026 | 04:21 PM