అల్లు శిరీష్ పెళ్లి.. గౌరవప్రదంగా చిరంజీవికి ఆహ్వానం..
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:57 PM
అల్లు వారింట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అల్లు అరవింద్ మూడో కుమారుడు శిరీష్ పెళ్లి పీటలెక్కనున్నారు.
అల్లు వారింట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అల్లు అరవింద్ (Allu Aravind) మూడో కుమారుడు శిరీష్ పెళ్లి పీటలెక్కనున్నారు. మార్చి 6న అల్లు శిరీష్, నయనిక రెడ్డితో ఏడడుగులు వేయనున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. 13వ తేదిన పసుపు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం శుభలేఖలు పంచే పనుల్లో అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఉన్నారు.

తొలి శుభలేఖను చిరంజీవికి (Chiranjeevi) అందజేశారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ‘తెలుగు సంప్రదాయం ప్రకారం తొలి శుభలేఖను మావయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖగారికి అందజేశాము’ అని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.
ALSO READ:
ప్రభాస్: ‘కపుల్ ఫ్రెండ్లీ’కి ప్రశంసలు.. తొలి రోజు కలెక్షన్స్ తెలుసా..
రామ్ చరణ్: బుచ్చిబాబు పుట్టినరోజు.. చెర్రీ విషెస్.. స్పెషల్ వీడియో
ఇరుముడి హీరోయిన్ లుక్ వచ్చేసింది..