ప్రభాస్‌: ‘కపుల్‌ ఫ్రెండ్లీ’కి ప్రశంసలు.. తొలి రోజు కలెక్షన్స్‌ తెలుసా..

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:23 PM

సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ చిత్రంపై ప్రభాస్‌ (Prabhas) అభినందనల వర్షం కురిపించారు.

సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ చిత్రంపై ప్రభాస్‌ (Prabhas) అభినందనల వర్షం కురిపించారు. ‘అందమైన ప్రేమకథా చిత్రమిది. నాకు ‘వర్షం’ సినిమాలా.. సంతోష్‌కి  కపుల్‌ ఫ్రెండ్లీ’ (Couple Friendly) గుర్తుండిపోతుంది. ఈ సినిమాను చాలా ఎంజాయ్‌ చేశాను. సంతోష్‌ - మానస జోడీ పర్ఫెక్ట్‌గా కుదిరింది. అశ్విన్‌ అద్భుతంగా తెరకెక్కించారు. ఇలాంటి మంచి కథల్ని తెరపైకి తీసుకొచ్చిన నిర్మాత అజయ్‌కు, యూవీ క్రియేషన్స్‌కు శుభాకాంక్షలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Prabhs.jpg

ప్రభాస్ ప్రశంసల పట్ల తాజాగా జరిగిన సక్సెస్‌మీట్‌లో సంతోశ్‌ శోభన్‌ మాట్లాడుతూ ‘వాలెంటైన్‌ డే సమయంలో వచ్చిన పర్ఫెక్ట్‌ ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాను  ప్రభాస్‌ చూసి.. ప్రశంసించడంతో  గెలిచానన్న అనుభూతిని కలిగించింది’ అన్నారు.  

యు.వి కాన్సెప్ట్‌ బ్యానర్‌లో రూపొందిన ఈ చితానికి అశ్విన్‌ చంద్రశేఖర్‌  తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా చక్కని విజయం సాధించింది. మొదటి రోజు వరల్డ్‌ వైడ్‌ 1.89 కోట్ల రూపాయలు గ్రాస్‌ వసూళ్లు రాబట్టిందని మేకర్స్‌ తెలిపారు. 

Updated Date - Feb 15 , 2026 | 04:42 PM