రామ్ చరణ్: బుచ్చిబాబు పుట్టినరోజు.. చెర్రీ విషెస్.. స్పెషల్ వీడియో
ABN , Publish Date - Feb 15 , 2026 | 03:33 PM
దర్శకుడిగా తొలి చిత్రం ‘ఉప్పెన’తో భారీ విజయం అందుకున్నారు బుచ్చిబాబు సాన. తదుపరి రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ చిత్రం తెరకెక్కిస్తున్నారు.
దర్శకుడిగా తొలి చిత్రం ‘ఉప్పెన’తో భారీ విజయం అందుకున్నారు బుచ్చిబాబు సాన. తదుపరి రామ్‌చరణ్‌తో ‘పెద్ది’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియాస్థాయిలో తెరకెక్కుతన్న చిత్రమిది. ఆదివారం బుచ్చిబాబు పుట్టినరోఉ సందర్భంగా రామ్‌చరణ్‌తో ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘పెద్ది’ కెప్టెన్ బుచ్చిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. సినిమాపై మీకున్న అమితాసక్తి, డిటైల్‌గా కథను చెప్పే విధానం సెట్స్‌లో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. మీరు మరిన్ని మ్యూజికల్ స్టోరీస్ క్రియేట్ చేద్దాం. ఈ ఏడాది.. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం, గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తున్నా’ అని రామ్‌చరణ్ పేర్కొన్నారు.
దీనికి బుచ్చిబాబు స్పందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. ఈ జర్నీలో చరణ్ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఎడిట్ రూమ్‌లో సినిమా చూసినప్పుడల్లా చరణ్ నటన కట్టిపడేస్తోంది. ‘పెది’ క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’ తెలిపారు. అలాగే మేకర్స్ కూడా బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.