సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: స్టార్‌డమ్‌ మారినా.. స్నేహితులు మారలేదు.. అదే అల్లు అర్జున్‌!

ABN, Publish Date - Aug 02 , 2026 | 02:55 PM

విజయం వస్తే చాలా విషయాలు మారిపోతాయి. మనుషులు మారతారు.. పరిచయాలు మారతాయి.. ప్రాధాన్యతలు కూడా మారుతాయి. కానీ కొందరు మాత్రం ఎంత ఎత్తుకు ఎదిగినా తమతో కలిసి నడిచిన వారిని ఎప్పటికీ మరచిపోరు.

Allu Arjun

విజయం వస్తే చాలా విషయాలు మారిపోతాయి. మనుషులు మారతారు.. పరిచయాలు మారతాయి.. ప్రాధాన్యతలు కూడా మారుతాయి. కానీ కొందరు మాత్రం ఎంత ఎత్తుకు ఎదిగినా తమతో కలిసి నడిచిన వారిని ఎప్పటికీ మరచిపోరు. అలాంటి వారిలో అల్లు అర్జున్‌ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా కోట్లాది మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నా.. చిన్ననాటి స్నేహితులను, తనను నమ్మి నిలిచిన వారిని ఇప్పటికీ అదే ఆప్యాయతతో వెంట తీసుకెళ్తున్నారు బన్నీ(Allu Arjun). ఆ మధ్య కాలంలో అల్లు అర్జున్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో  AA23   చిత్రం  ప్రకటించినప్పుడు అందరి దృష్టి ఆ సినిమా రేంజ్  మీదే పడింది. కానీ ఆక్కడ బయటకు రాణి ఓ విషయం ఉంది.  మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితమైన నలుగురు స్నేహితులు ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా బాధ్యతలు అప్పగించారు. అది క్రెడిట్‌ కాదు.. ఏళ్ల తరబడి కొనసాగుతున్న స్నేహానికి ఆయన ఇచ్చిన గౌరవం. 

ఈ జాబితాలో బన్నీ వాస్‌ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అల్లు అర్జున్‌ సినీ ప్రయాణంలో ఆయనకు అండగా నిలిచిన వ్యక్తి. అలాగే స్కూల్‌ రోజుల నుంచే తోడుగా ఉన్న సందీప్‌ రామినేని, నటరాజ్‌, చిన్ననాటి స్నేహితురాలు స్వాతి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. సినీ పరిశ్రమలో విజయం వచ్చిన తర్వాత పాత పరిచయాలను మరిచిపోతారు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.  కానీ అల్లు అర్జున్‌ మాత్రం తన విజయాన్ని ఒంటరిగా ఆస్వాదించకుండా, తనతో పాటు నడిచిన వారికీ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. స్నేహం అంటే కేవలం కలిసి ఫొటోలు దిగడం కాదు... ఒకరి కలలకు మరొకరు బలంగా నిలవడం అని నిరూపించారు బన్నీ. మనల్ని ప్రపంచం గుర్తించే ముందే మనపై నమ్మకం ఉంచిన వారిని, విజయం వచ్చిన తర్వాత కూడా అదే ప్రేమతో వెంట తీసుకెళ్లడం. అదే నిజమైన స్నేహం అని బన్నీ చెబుతున్నారు. 

 ALSO READ:

Raashii Khanna: సంతోషంలో కాదు.. కష్టాల్లో తోడుండేవారే అసలైన స్నేహితులు

‘కాక్‌టెయిల్‌ 2’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Updated Date - Aug 02 , 2026 | 03:16 PM