సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బన్నీ-లోకేష్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజం ఇదే

ABN, Publish Date - Oct 12 , 2026 | 07:04 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై వస్తున్న రూమర్స్‌కు లోకేష్ బ్రేక్ వేశారు.

Lokesh Kanagaraj and Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ వార్తలతో బన్నీ అభిమానులు ఆందోళన చెందారు. కానీ, ఆ రూమర్లన్నింటికీ తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తనదైన శైలిలో చెక్ పెట్టేశారు. అల్లు అర్జున్‌ (Allu Arjun)తో దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్ రానున్నాయని వెల్లడించారు. ఈ పోస్ట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. లోకేష్ చేసిన ఈ ట్వీట్‌తో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్, అధికారిక ప్రకటన లేదా షూటింగ్ షెడ్యూల్ వివరాలు వెలువడే అవకాశం ఉందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.


ఇక ఈ ఏడాది జనవరిలో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ తొలిసారి కలిసి పనిచేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించింది. కథ గురించిన పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, ఆ వీడియోతోనే అంచనాలు స్కై రేంజ్‌కి వెళ్లిపోయాయి. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, లోకేష్ రా అండ్ రస్టిక్ మేకింగ్, అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ కలిస్తే తెరపై ఎలాంటి విజువల్ వండర్ చూస్తామోనని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ (Raaka) చిత్రంతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రాకా’పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ ప్రత్యేకమైన కథన శైలి, పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు అల్లు అర్జున్ ఇమేజ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ కాంబో ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది?.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు క్రియేట్ చేయనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

ఊటీలో ‘జనవరి 12 విడుదల’ టీమ్.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలే

‘వారణాసి’లో రామాయణ ఘట్టంపై జక్కన్న సంచలన వ్యాఖ్యలు

30 ఏళ్ల సినీ ప్రయాణం.. పవర్ స్టార్‌కు అల్లు అరవింద్ అభినందనలు

Updated Date - Oct 12 , 2026 | 07:09 PM