సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sarath Chandra Naidu: ఆ విషయంలో అల్లు అర్జున్ ముందుంటారు

ABN, Publish Date - Jul 18 , 2026 | 11:47 AM

అల్లు అర్జున్ కు సంబంధించిన డిజిటల్, సోషల్ మీడియా వ్యవహారాలను ఎంతో కాలంగా చూసుకుంటున్న శరత్ చంద్ర నాయుడు నిర్మాత మారారు. 

ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని అల్లు అర్జున్‌ (Allu Arjun) ఎంకరైజ్‌ చేశారన్నారు శరత్ చంద్ర నాయుడు(Sarath Chandra Naidu). అల్లు అర్జున్ కు సంబంధించిన డిజిటల్, సోషల్ మీడియా వ్యవహారాలను ఎంతో కాలంగా చూసుకుంటున్న శరత్ చంద్ర నాయుడు నిర్మాత మారారు. ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సీరిస్‌తో నిర్మాతగా తొలి అడుగు వేశారు. ఈటీవీ విన్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చేయడానికి కారణం, దీనికి వస్తున్న స్పందన గురించి ఆయన మాట్లాడారు. 

'ఈ ప్రయాణం నా ఇన్‌స్టాగ్రామ్ పోడ్‌కాస్ట్ పేజ్ ‘రేలంగి మావయ్య’తో ప్రారంభమైంది. అందులో నేను 90వ దశకానికి చెందిన జ్ఞాపకాలను నా స్వరంలో షేర్ చేస్తుంటాను. కాలక్రమేణా ఆ పేజ్‌కు ప్రేక్షకుల నుంచి అపారమైన ఆదరణ లభించింది. ఆ కాలంలో పెరిగిన వారితో బలమైన అనుబంధం ఏర్పడింది. ఆ కంటెంట్‌ను చూసిన తర్వాత ఈటీవీ విన్‌కు చెందిన సాయి, నితిన్ఆ  భావోద్వేగాలను వెబ్ సిరీస్‌గా మలిచే అవకాశం ఉందని భావించారు. అలా ‘గుర్తుకొస్తున్నాయి’ పుట్టుకొచ్చింది. ఈ సిరీస్ చక్కని ఆదరణ పొందింది. ఈ జర్నీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన సపోర్ట్ ఒక మెయిలు రాయిలా నిలిచింది. నా  కొత్త ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేసిన ఐకాన్ స్టార్, నన్ను  వ్యక్తిగతంగా అభినందించారు. ఎన్నాళ్లుగానో తనతో కలిసి పని చేసిన టీమ్ సభ్యుల్లో ఒకరు నిర్మాతగా తొలి అడుగు వేయడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని అల్లు అర్జున్‌ ఎంకరైజ్‌ చేశారు. ఇది మా ఇద్దరి మధ్య ఉన్న బలమైంది బంధానికి ఒక నిదర్శనం. నా జర్నీ మార్కెటింగ్ కే పరిమితం కాకుండా  రచన, నిర్మాణం, హృదయాన్ని తాకే కథను తెరపైకి తీసుకురావడం వరకు  వెళ్లిందని  అందరు అంటుంటే  ఆనందంగా ఉంది. ఈ విజయంతో అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో విజయవంతమైన నిర్మాత వచ్చారు అనడం,  సినీ నిర్మాణ రంగంలో ఇది నా  కొత్త ప్రయాణానికి శ్రీకారం' అని అన్నారు.

ALSO READ:

Varanasi: పుట్టినరోజు స్పెషల్.. ప్రియాంక లుక్ అదిరింది

Pallichattambi Ott: మూడు నెలల తర్వాత   ఓటీటీ  స్ట్రీమింగ్‌

Anna Lezhneva: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ భార్య

Avira: సినిమా నిర్మాణంలో ఏఐ విప్లవం.. ‘అవిరా’తో కొత్త ప్రయోగం


 

Updated Date - Jul 18 , 2026 | 01:11 PM