Pallichattambi Ott: మూడు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్
ABN , Publish Date - Jul 18 , 2026 | 08:29 AM
ఇటీవల కాలంలో థియేటర్ లో రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి కొన్ని చిత్రాలు. ఓ మలయాళ చిత్రం మాత్రం మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ కు సిద్దమయింది.
ఇటీవల కాలంలో థియేటర్ లో రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి కొన్ని చిత్రాలు. ఓ మలయాళ చిత్రం మాత్రం మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ కు సిద్దమయింది. అదే టోవినో థామస్, కయదు లొహర్ జంటగా నటించిన ‘పల్లిచట్టంబి’ చిత్రం. ఈ నెల 24వ తేదీ నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌కానుంది. డిజే జోస్ ఆంటోని దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిస్టారికల్ బ్యాక్‌డ్రా్‌పలో సాగే ఒక యాక్షన్ ప్యాక్డ్ డ్రామా. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ '1958లో కేరళ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కనియార్ అనే కొండ గ్రామంలో రాజకీయాలు, మతం, అధికారం ఎలా పోటీ పడతాయోలో ఈ సినిమా చూపిస్తుంది. టోవినో థామస్ కృష్ణపిళ్ళై అనే చపలచిత్తుడైన రౌడీ పాత్రను పోషించారు. ఆ గ్రామంలో ఉండే చర్చిని రక్షించే ‘పల్లిచట్టంబి’గా ఎలా మారతాడు? అక్కడ జరిగే రాజకీయ ఘర్షణలో ఎలా చిక్కుకుంటాడు? అన్నదే ఈ చిత్ర కథ. సహాయక పాత్రల్లో విజయరాఘవన్, సిద్ధిక్, బాబురాజ్, టీజీ రవి తదితరులు నటించగా, ప్రత్యేక పాత్రలో పృథ్వీరాజ్ నటించారు. నౌఫల్ అహ్మద్, బ్రిజేష్ మహమ్మద్, సీసీసీ బ్రదర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
‘వృషకర్మ’.. నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ డీల్!
మిల్కీబ్యూటీ మరో బోల్డ్ స్టెప్.. గ్లామరస్ హారర్ రోల్ చిత్రం ప్రారంభం
ఐశ్వర్య రాజేష్ సుకుమారి షాక్ ఎలా ఉందంటే..