సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nagarjuna: సోషల్ మీడియా అత్యంత క్రూరమైనది..  

ABN, Publish Date - Nov 08 , 2026 | 01:09 PM

సోషల్ మీడియా ప్రభావం నేటి యువతపై ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సోషల్ మీడియా ప్రభావం నేటి యువతపై ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు.  తాజాగా అక్కినేని నాగార్జున (Nagarjuna) సోషల్ మీడియా గురించి ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు. ఆయన సమర్పణలో మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించిన చిత్రం 'ఇట్లు అర్జున' (Itlu Arjuna) . వెంకీ కుడుముల నిర్మించారు. అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నెల 13న ‘ఇట్లు అర్జున’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచారంలో భాగంగా నాగార్జున, హీరో అనీష్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

‘మా తరం చాలా అదృష్టవంతులం. మా రోజుల్లో సోషల్ మీడియా లేదు. కానీ ఈ తరానికి సోషల్ మీడియా చేతిలోనే ఉంది. అది అత్యంత క్రూరమైనది. దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ముఖ్యంగా యువత దాని ప్రభావానికి లోనవుతుంది" ’ అని నాగార్జున పేర్కొన్నారు. అలాగే త్వరలో విడుదల కానున్న ‘ఇట్లు అర్జున’ సినిమాపై కూడా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం యువతరానికి బాగా కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నేటి యువత ఆలోచనలు, వారి జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులకు ఈ సినిమా దగ్గరగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ALSO READ:

శ్రీలీల.. వరుస అవకాశాల వెనుక అసలు సీక్రెట్ ఇదా

Shruti Haasan: నా దశ మార్చేసిన సినిమా అదే.. శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు

Dheeraj Mogilineni: ఇతర భాషల సినిమాలకు బ్రహ్మరథం.. మన సినిమాలొస్తే విమర్శలా?

Updated Date - Nov 08 , 2026 | 02:07 PM