సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akira Nandan: కాపాడండి.. హై కోర్టుకు అకీరానందన్

ABN, Publish Date - Jan 24 , 2026 | 06:36 AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Akira Nandan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన పేరుతో, తన ముఖాన్ని ఉపయోగిస్తూ ప్రచారం చేస్తున్న ఏఐ ఆధారిత కంటెంట్ నుంచి తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పిటిషన్ దాఖలు చేశారు.

తనకు సంబంధించిన ఏఐ ఆధారిత వీడియోలు, ఫోటోలు తన గోప్యతకు భంగం కలిగించడంతో పాటు వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనగా మారుతున్నాయని పిటిషన్‌లో అకీరా పేర్కొన్నారు.

ఏఐ సాంకేతికతతో తన పేరుతో రూపొందిస్తున్న కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ ప్రచారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని అకీరా కోరారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Jan 24 , 2026 | 07:02 AM