నెక్ట్స్ బోయపాటితో.. అయ్యగారి న్యూలుక్ చూశారా
ABN, Publish Date - Aug 22 , 2026 | 01:14 PM
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని సినిమాల ఎంపికలో గేర్ మార్చి స్పీడ్ పెంచారు. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అయ్యగారు, తన తదుపరి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టే పనిలో బిజీగా ఉన్నారు.
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) సినిమాల ఎంపికలో గేర్ మార్చి స్పీడ్ పెంచారు. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ (Lenin) చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అయ్యగారు, తన తదుపరి ప్రాజెక్టులను లైన్‌లో పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన లేటెస్ట్ మేకోవర్‌కు సంబంధించిన సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై విపరీతంగా వైరల్ అవుతోంది. గుబురు గడ్డం, మీసకట్టు, సరికొత్త హెయిర్‌స్టైల్, ఇంకా చెవికి పోగుతో ఎంతో స్టైలిష్‌గా, రగ్గడ్ అండ్ హ్యాండ్‌సమ్ అవతారంలో అఖిల్ దర్శనమిచ్చారు. ఈ న్యూలుక్ చూసిన నెటిజన్లు, అక్కినేని అభిమానులు ‘అరేయ్.. ఏంట్రా ఆ లుక్.. అదిరిపోయింది అంతే!’ అంటూ ఫిదా అయిపోతున్నారు.
ఈ సరికొత్త లుక్ వైరల్ అవ్వడంతో పాటు అఖిల్ తదుపరి చిత్రం Akhil7 గురించిన ఓ సెన్సేషనల్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. అఖిల్ తన 7వ చిత్రాన్ని టాలీవుడ్ ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని సమాచారం. బోయపాటి మార్కు పవర్‌ఫుల్ యాక్షన్ ఎలివేషన్స్, మాస్ అంశాలతో అఖిల్‌ను నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో సరికొత్త డైమెన్షన్‌లో ప్రెజెంట్ చేయడానికి స్క్రిప్ట్ సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారనే ప్రచారం కూడా ప్రాజెక్ట్‌పై హైప్‌ను మరింత పెంచేసింది.
మరోవైపు, గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్ అక్కినేని కుటుంబానికి ఎంతో అచ్చొచ్చిన సంస్థగా పేరుంది. గతంలో ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో అఖిల్ అన్న యువసామ్రాట్ నాగచైతన్య నటించిన ‘100 పర్సెంట్ లవ్’, రీసెంట్‌గా వచ్చిన ‘తండేల్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు అదే సూపర్ హిట్ సెంటిమెంట్‌ను అఖిల్‌కు కూడా వర్కవుట్ చేయాలని అక్కినేని ఫ్యామిలీ భావిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు, బోయపాటి ఊరమాస్ టేకింగ్ తోడైతే అఖిల్‌కు తిరుగులేని మాస్ బ్లాక్‌బస్టర్ పక్కా అని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువ.. బన్నీ పోస్ట్ వైరల్
మామ ‘కాకా’.. అల్లుడు ‘రాకా’.. సరికొత్త సెంటిమెంట్