Aishwarya Lekshmi : 'రాకా’ రూమర్స్‌పై ఐశ్వర్య క్లారిటీ!
ABN, Publish Date - Oct 03 , 2026 | 03:51 PM
‘రాకా’లో (Raaka) తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలపై నటి ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) స్పందించారు.
‘రాకా’లో (Raaka) తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలపై నటి ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ రూమర్స్‌ను చూసి తాను కూడా నవ్వుకున్నానని తెలిపారు. ఎవరైనా ‘రాకా’లో అవకాశం ఇప్పించాలని సరదాగా కోరారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కీలకమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే ఈ వార్తలను ఆమె ఖండించారు.
తాను ‘రాకా’లో నటించడం లేదని స్పష్టం చేస్తూ.. తనకు కూడా ఆ సినిమాలో ఛాన్స్ ఇప్పించాలని సరదాగా చెప్పడంతో రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయింది. ‘రాకా’లో నలుగురు హీరోయిన్లకు స్కోప్ ఉందని చాలా కాలంగా టాక్ నడుస్తోంది. అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తున్నట్లు మాత్త్రం ప్రకటించారు. మలయాళ నటి ఫెమినా జార్జ్ కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు జాన్వీ కపూర్, రష్మిక మందన్న పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయంలో యితే ఈ ఇద్దరి విషయంలో చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పబ్లిగ్గా బుగ్గగిల్లిన ఆకతాయి.. షాకైన హీరోయిన్.. వీడియో వైరల్
8 వారాల తర్వాతే ఓటీటీల్లోకి సినిమా: డిస్ట్రిబ్యూటర్ల తీర్మానం
RC17: చరణ్, సుక్కు మూవీ.. స్టార్ట్ కాకుండానే డెడ్‌లైన్!