సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మహేశ్, అల్లు అర్జున్ బాట‌లో.. ఎన్టీఆర్! గచ్చిబౌలిలో.. భారీ లగ్జరీ మల్టీప్లెక్స్?

ABN, Publish Date - Aug 01 , 2026 | 07:39 AM

టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు సినిమా నిర్మాణంతో పాటు పంపిణీ, థియేటర్ వ్యాపారాల్లోనూ తమ మార్క్ చూపిస్తున్నారు.

ntr

టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు కేవలం వెండితెరపై నటనకే పరిమితం కావడం లేదు. సినిమా నిర్మాణంతో పాటు పంపిణీ, థియేటర్ వ్యాపారాల్లోనూ తమ మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా లగ్జరీ మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తూ ఎగ్జిబిషన్ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు చిత్రసీమలో ఈ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ముందువరుసలో ఉంటారు. ఏషియన్ సినిమాస్ (Asian Cinemas)తో కలిసి ఆయన నిర్మించిన ‘ఏఎంబీ సినిమాస్’ దేశంలోనే అత్యుత్తమ మల్టీప్లెక్స్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అత్యాధునిక సౌండ్, స్క్రీనింగ్ టెక్నాలజీ, మైండ్ బ్లోయింగ్ లగ్జరీ వసతులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ క్ర‌మంలోనే మహేశ్ బాబు బాటలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా థియేటర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ‘ఏఏఏ సినిమాస్’ (AAA Cinemas) ప్రారంభించి సినీ ప్రియులకు సరికొత్త థియేటికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించారు. వీరితో పాటు మాస్ మహారాజా రవితేజ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టి తమ వ్యాపార పరిధిని విస్తరించుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ స్టార్స్ జాబితాలోకి ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ (NTR) కూడా చేరబోతున్నారనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్రంగా చక్కర్లు కొడుతోంది.

అవును... తారక్ కూడా హైదరాబాద్ నగరంలో ఒక భారీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. నగరంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతంలో ఒక అత్యాధునిక ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. ఈ ప్రచారంపై ఇప్పటివరకు తారక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ పరిసర ప్రాంతాలు నానాటికీ ఐటీ, కార్పొరేట్ సంస్థలతో కలకలలాడుతున్నాయి. వేలాది మంది ఐటీ ఉద్యోగులు, భారీ నివాస సముదాయాలు ఇక్కడ ఉన్నాయి. దాంతో ఈ లొకేషన్‌లో ప్రీమియం మల్టీప్లెక్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుందని బిజినెస్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే తారక్ ఈ లొకేషన్‌ను ఎంచుకున్నారని అంటున్నారు.

ఈ వార్త కనుక నిజమైతే... మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ బాటలో థియేటర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మరో బిగ్ స్టార్‌గా జూనియర్ ఎన్టీఆర్ నిలుస్తారు. ఎన్టీఆర్ నిర్మించబోయే ఈ మల్టీప్లెక్స్ కూడా ఏ స్థాయిలో ఉండబోతోందోనని అభిమానులు ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తారక్ ‘డ్రాగన్’ ప్రాజెక్ట్‌తో ఎంతో బిజీగా ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవైపు నటనలో ఆల్ రౌండర్ ప్రదర్శన ఇస్తూనే, మరోవైపు ఇలాంటి వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టడం తారక్ విజన్‌కు నిదర్శనం. గచ్చిబౌలి మల్టీప్లెక్స్‌పై త్వరలోనే అధికారిక సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Aug 01 , 2026 | 08:04 AM