‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్‌కు ఎన్టీఆర్?
ABN, Publish Date - Oct 26 , 2026 | 06:11 PM
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ అయింది. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కారణంగా పలు చిన్న చిత్రాల విడుదల తేదీలు మారాయి.
వెంకటేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. సో... తాజాగా నిర్మాత నాగవంశీ చెప్పినట్టుగా ఈ సినిమా ఇదే నెల 30న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే... ఈ నెల 27న హైదరాబాద్ శిల్పకళా వేదికలో 'ఆదర్శ కుటుంబం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో నెక్ట్స్ 'గాడ్ ఆఫ్ వార్' తెరకెక్కబోతోంది. అలానే గతంలో వెంకటేశ్ సినిమా 'చింతకాయల రవి'తో ఎన్టీఆర్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. చిత్ర నిర్మాణ సంస్థతోనూ, దర్శకుడు త్రివిక్రమ్ తోనూ, హీరో వెంకటేశ్ తోనూ ఉన్న అనుబంధం కారణంగా ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరవుతాడనే స్పెక్యులేషన్ ఫిల్మ్ నగర్‌లో సాగుతోంది.
చిన్న చిత్రాలు బేజారు!
ఈ నెల 2న రావాల్సిన ఆదర్శ కుటుంబం ఆ తర్వాత 9వ తేదీకి, ఆపైన 30కి మారింది. దాంతో 30వ తేదీ రావాల్సిన చిన్న సినిమాలన్నీ వివిధ తేదీలకు వాయిదా పడ్డాయి. 'ఇట్లు అర్జున' సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. 'రోమియో జూలియట్' మూవీ నవంబర్ 13కి వెళ్ళిపోగా, 'సమ్మర్ హాలిడేస్' మూవీని నవంబర్ 6న విడుదల చేస్తున్నారు. 'అ' సినిమా విడుదల నవంబర్ 12కి వెళ్ళింది. అలానే 'చంద్రయాన్' మూవీ సైతం నవంబర్ 13కి వాయిదా పడింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి రావాల్సిన 'ఏమో ఏమో ఇది' సినిమాను సైతం 'ఆదర్శ కుటుంబం' కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా ఏకంగా ఆరు సినిమాలు కొత్త రిలీజ్ డేట్ ను వెతుక్కుని వెనక్కి వెళ్ళిపోయాయి. ఇక 30న రావాల్సిన 'కిల్లర్', 'కల్ట్' మూవీస్ మాత్రం అదే తేదీకి వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని
రజనీతో రజనీకే పోటీ.. టాప్-3లో ఒకడే కింగ్
సూర్యకు ఈ ఏడాది త్రిపుల్ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే