Kajal Aggarwal: పెళ్లయ్యాక.. హద్దులు చెరిపేసిన చందమామ! ఈ లెవల్‌లో.. షాక్ ఇచ్చిందేంటి
ABN, Publish Date - May 27 , 2026 | 06:30 PM
పెళ్లి తర్వాత హోమ్లీగా కనిపించిన కాజల్.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. బ్లష్ పింక్ మినీ డ్రెస్‌లో చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది!
టాలీవుడ్‌లో దాదాపు ఒక దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్‌గా వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిషన్‌లో కొనసాగిన బ్యూటీ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కరోనా మహమ్మారి రాకముందు వరకు కాజల్ జోరు ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద హీరో సినిమా వస్తోందంటే చాలు.. అందులో హీరోయిన్ లిస్ట్‌లో ఫస్ట్ పేరు కాజల్‌దే ఉండేది. కెరీర్ అలా పీక్ స్టేజ్‌లో దూసుకుపోతున్న సమయంలోనే, ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కు ఒక ఊహించని షాక్ ఇచ్చింది.
ఎవరూ ఊహించని విధంగా ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్‌మెన్ గౌతమ్ కిచ్లూను పెళ్లాడి అభిమానుల గుండెల్లో బాంబు పేల్చింది. పెళ్లి తర్వాత, ఒక బాబుకు జన్మనిచ్చిన ఈ చందమామ.. ఫ్యామిలీ లైఫ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. దాంతో సహజంగానే సినిమాల స్పీడ్ తగ్గుకుంటూ వచ్చింది. అయితే, బాబు పుట్టిన తర్వాత మళ్లీ మునుపటిలా స్క్రీన్‌పై మ్యాజిక్ చేయాలని కాజల్ గట్టిగానే డిసైడ్ అయింది. కానీ, ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ అనుకున్నంత ఈజీ కాదు. ఎంత ట్రై చేసినా.. మునుపటిలా వరుస ఆఫర్లు, స్టార్ ప్రాజెక్టులు మాత్రం అంతగా కలిసిరాలేదు.
అయితే, టాలెంట్ ఉన్న బ్యూటీని లక్ ఎక్కువ కాలం దూరం పెట్టలేదు కదా. రీసెంట్‌గా కాజల్ ఖాతాలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పడ్డాయి. బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రావణాసురుడి భార్య మండోదరి లాంటి పవర్ ఫుల్ పౌరాణిక పాత్రను దక్కించుకుంది. టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కాజల్ హీరోయిన్‌గా గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.
వీటితో పాటు, సమాజంలో జరుగుతున్న ఫెర్టిలైజర్స్ స్కామ్ నేపథ్యంలో వస్తున్న ది ఇండియా స్టోరీ అనే సోషల్ థ్రిల్లర్‌లో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోంది. కెరీర్ పరంగా ఈ ప్రాజెక్టులు అమ్మడికి ఏ రేంజ్‌లో ప్లస్ అవుతాయో కాలమే సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో కాజల్ చేసిన రచ్చ మరో ఎత్తు. పెళ్లి తర్వాత చాలా హోమ్లీగా, డీసెంట్‌గా కనిపిస్తూ వచ్చిన కాజల్.. రీసెంట్‌గా చేసిన ఫోటోషూట్‌లో మాత్రం గ్లామర్ హద్దులన్నీ చెరిపేసి అందరికీ మైండ్ బ్లాక్ చేసింది.
బ్లష్ పింక్ కలర్ మినీ డ్రెస్‌లో కాజల్ మెరిసిపోతున్న తీరు చూసి యూత్ మొత్తం క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. పెళ్లయ్యాక సినిమాల స్పీడ్ తగ్గించినా.. గ్లామర్ డోస్ మాత్రం అస్సలు తగ్గించలేదు అని నిరూపించింది. ఈ ఫోటోలకు ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. అల్ బ్లుష్, నో బ్లఫ్ అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏజ్‌లో కూడా ఇంత హాట్‌గా, ఫిట్‌గా ఎలా మెయింటైన్ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అయితే, కాజల్ సడెన్‌గా ఇంతలా రూటు మార్చడం వెనుక అసలు ప్లాన్ ఏంటి..? ఈ రేంజ్ గ్లామర్ షోతో అమ్మడు నయా హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా.. మేకర్స్‌కు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ పంపిస్తోందా..? గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా తాను ఎప్పుడూ రెడీనే అని హింట్ ఇస్తోందా..? కచ్చితంగా ఈ హాట్ ఫోటోషూట్ చూశాక, కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ కోసం డైరెక్టర్లు మళ్లీ కాజల్ వైపు చూసే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. మరి ఈ నయా అవతారంతో కాజల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుందో చూడాలి.