కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్, తమన్నా
ABN , Publish Date - Oct 07 , 2026 | 10:45 AM
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, హీరోయిన్ తమన్నా వేర్వేరుగా బుధవారం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) వేర్వేరుగా బుధవారం తిరుమల శ్రీనివాసుడిని (Tirumala) దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రాజేంద్ర ప్రసాద్ విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.
అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న తమన్నా స్వామి వారి సుప్రభాతం,తోమాల, అర్చన సేవల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై వారికి దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
ఇవి కూడా చదవండి:
అభిమాని హత్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్
ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!
నిన్న రాజశేఖర్.. నేడు విజయ శాంతి! అసలు బాలయ్యతో.. ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ శివయ్య