NTR: భుజం సర్జరీ.. మొన్న బావకి.. నేడు బామ్మర్దికి

ABN , Publish Date - Nov 04 , 2026 | 09:13 PM

సినిమా అంటే చిన్న విషయం కాదు. హీరోలు కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని మాత్రమే ప్రేక్షకులకు తెలుసు కానీ, సినిమా కోసం వారు తమ లైఫ్ ని కూడా రిస్క్ చేస్తుంటారు.

Nithin Narne

సినిమా అంటే చిన్న విషయం కాదు. హీరోలు కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని మాత్రమే ప్రేక్షకులకు తెలుసు కానీ, సినిమా కోసం వారు తమ లైఫ్ ని కూడా రిస్క్ చేస్తుంటారు. కొంతమంది హీరోలు డూప్ లను వాడకుండా రిస్క్ షాట్స్ ని రియల్ గా చేస్తూ గాయాలపాలవుతారు. ఈమధ్య ఎన్టీఆర్ (NTR) కి కూడా భుజం సర్జరీ జరిగిన విషయం తెల్సిందే. డ్రాగన్ షూటింగ్ లో ప్రమాదం జరగడంతో తారక్ భుజానికి వైద్యులు సర్జరీ చేశారు. కొన్ని రోజులు రెస్ట్ లో ఉన్న ఆయన ఇటీవలే కోలుకొని సెట్ లో అడుగుపెట్టాడు. తారక్ కోలుకోగానే ఆయన బామ్మర్ది నితిన్ నార్నేకి భుజం సర్జరీ జరిగింది.


యువ నటుడు నితిన్ నార్నేకి భుజం సర్జరీ జరిగిందని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కుడి భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయన నవంబర్ 4న హైదరాబాద్‌లోని ప్రముఖ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు ఉదయం ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణుల వైద్య బృందం నితిన్ కి అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించింది. ఈ వైద్య బృందంలో డాక్టర్ ఈశ్వర్ పటేల్, డాక్టర్ హరికృష్ణ బచ్చు, డాక్టర్ మధుసూదన్ పాల్గొని సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు అధికారికంగా వెల్లడించారు.ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరియు సినీ వర్గాలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం ప్రారంభించారు.


శస్త్రచికిత్స తర్వాత పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కొద్దిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరమని ఆసుపత్రి వర్గాలు సూచించాయి. త్వరలోనే ఆయన మళ్లీ షూటింగ్‌లలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ సున్నితమైన సమయంలో నటుడి కుటుంబ సభ్యులకు పూర్తి గోప్యత కల్పించాలని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అభిమానులు, మీడియా ప్రతినిధులు ఎటువంటి అనవసరపు వదంతులను నమ్మవద్దని, అలాగే ఆసుపత్రి వద్దకు వచ్చి సందడి చేయవద్దని కోరారు. త్వరలోనే నితిన్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కానున్నాడు.ఏదిఏమైనా ఈ బావబామ్మర్దిలు షూటింగ్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని, రిస్కీ షాట్స్ కి దూరంగా ఉండాలని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

Medha Meka: మరో శ్రీలీలలా మారకమ్మా..

Allu Arjun: రామాయణ.. మన సంస్కృతికి ప్రతిబింబం

అది ధైర్యం కాదు.. నార్త్ భామలకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్

Updated Date - Nov 04 , 2026 | 09:19 PM