మంచు మనోజ్ గొప్ప మనసు.. అడిగిన వెంటనే విరాళం

ABN , Publish Date - May 26 , 2026 | 05:23 PM

మంచు వారబ్బాయి మంచు మనోజ్ (Manchu Manoj) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు ఫ్యామిలీలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అంటే మనోజ్ అని చెప్పొచ్చు.

Manchu Manoj

మంచు వారబ్బాయి మంచు మనోజ్ (Manchu Manoj) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు ఫ్యామిలీలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో అంటే మనోజ్ అని చెప్పొచ్చు. ఇక పెళ్ళి తరువాత మనోజ్ కెరీర్ పైన బాగా ఫోకస్ పెట్టాడు. హీరోగానే కాకుండా విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి మంచి పాత్రలను ఎంచుకొని సక్సెస్ వైపు దూసుకెళ్తున్నాడు. దీంతో పాటు భార్యతో కలిసి సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. తాజాగా మరోసారి మనోజ్ తన గొప్ప మనసును చాటుకున్నాడు.


తాజాగా మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్నిసందర్శించాడు. ఆశ్రమ నిర్వాహకుడు గిరి సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనకు మంచు మనోజ్ తక్షణమే స్పందించడమే కాకుండా.. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారి అవసరార్థం పెద్ద ఎత్తున టేబుళ్లు, కుర్చీలను తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి విరాళంగా అందజేశాడు. అంతేకాకుండా ఆయనే స్వయంగా ఆశ్రమానికి వెళ్లి వాటన్నింటినీ నిర్వాహకులకు అప్పగించి అక్కడి వారితో కొంత సమయం గడిపాడు. వృద్దులకు పండ్లను అందజేశాడు.


ఇక ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. 'సమాజంలో దిక్కులేని వారికి, ఎవరూ లేని వారికి అండగా నిలబడటం అన్నిటికంటే గొప్ప విషయం. మాతృదేవోభవ ఆశ్రమం చేస్తున్న సేవలు అభినందనీయం. కేవలం ఇక్కడితోనే ఆగిపోకుండా, భవిష్యత్తులో కూడా ఈ ఆశ్రమానికి నావంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తాను' అని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనోజ్ చేసిన ఈ మంచి పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు, ఆయన అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బాలీవుడ్ బ్యాన్.. సడెన్ గా అక్కడ కనిపించిన ధురంధర్ హీరో

పెద్ది.. పస లేదు.. ఇంకా ఏదో కావాలి

Ntr Fans: తారక్‌ బర్త్‌డే.. ఆ కుటుంబానికి ఎంత అభిమానమో..

Updated Date - May 26 , 2026 | 05:45 PM