సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘వారణాసి’లో చిన్నప్పటి మహేష్‌గా అభయ్ రామ్.. స్క్రీన్స్ ఉంటాయా!

ABN, Publish Date - Jul 12 , 2026 | 11:31 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’. టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి.

Abhay Ram in Mahesh Babu Varanasi

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), గ్లోబల్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వారణాసి’ (Varanasi). టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఈ సినిమా కోసం వేచి చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించి లీక్స్ అసలు ఆగడం లేదు. ఏదో ఒక సీన్ లీక్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో నటించే ఓ పాత్రకు సంబంధించి లీక్స్ వైరల్ అవుతున్నాయి. ఆ పాత్రధారి ఎవరో కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ (Abhay Ram) అనేలా టాక్ మొదలైంది.


ఎన్టీఆర్‌కు రాజమౌళికి ఉన్న అనుబంధం గురించి తెలియంది కాదు. ఆ అనుబంధంతోనే సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నప్పటి పాత్ర కోసం వేరే ఎవరినో కాకుండా, లిటిల్ టైగర్‌ని పరిచయం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో అభయ్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని కూడా వినిపిస్తోంది. అందుకే రాజమౌళి అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ ఓకే చెప్పాడనే న్యూస్ తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ వార్త నిజమా? కాదా? అనేది మాత్రం ఇప్పుడప్పుడే అధికారికంగా తెలియకపోవచ్చు. ఎందుకంటే, రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని ఇప్పుడప్పుడే అఫీషియల్‌గా రివీల్ చేసేలా లేరు.


ఇక ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఎప్పుడెప్పుడు నందమూరి నెక్ట్స్ జనరేషన్ నటుడిని చూద్దామా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, మహేష్ బాబు రూపంలో అభయ్‌ రామ్‌ని పరిచయం చేయడమనే వార్త.. వారికి పెద్ద పండగలా మారిపోయింది. నిజంగా ఈ వార్త నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడిని సుకుమార్ పరిచయం చేస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్ తనయుడిని దర్శకధీరుడు రాజమౌళి పరిచయం చేస్తున్నాడనేలా కూడా కామెంట్స్ పడుతున్నాయి. మొత్తంగా అయితే, మహేష్ బాబు అండ్ అభయ్ రామ్ అనే వార్త వినగానే.. సాధారణ ప్రేక్షకులు కూడా స్క్రీన్స్ ఉంటాయా? అనేలా ఆశ్చర్యపోతుండటం విశేషం.. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

ఇవి కూడా చదవండి:

హాలీవుడ్ దర్శకుడిని ఆకర్షించిన మహేష్ తనయుడు.. ఏం జరుగుతోంది

నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను: కౌసల్య

విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! ‘జననాయగన్’ మళ్లీ వాయిదా..

Updated Date - Jul 12 , 2026 | 11:31 PM