మరోసారి విజయ్ సేతుపతి, మణిరత్నం

ABN , Publish Date - Mar 18 , 2026 | 03:45 PM

అదృష్టముంటే తప్ప ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు కుదరవు. ఆ లెజెండ్ డైరెక్టర్‌తో సినిమా అంటే ఏ కొందరికో ఛాన్స్ వస్తుంది. అయితే అలాంటి అవకాశం ఆ హీరోకు మరోసారి కుదరడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

కోలీవుడ్‌లో మరో సెన్సేషన్ కాంబినేషన్ సెట్ అయింది. హీరో విజయ్ సేతుపతి అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఒక లవ్ స్టోరీ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశాడు. ఈ న్యూస్ విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌కే కాకుండా సినిమా ప్రియులకూ సర్ప్రైజ్‌గా మారింది.


మణిరత్నంతో విజయ్‌ సేతుపతి గతంలో 'నవాబ్' సినిమా చేశాడు. తాజాగా తన అప్ కమింగ్ ప్రాజెక్టుపై మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెల్లడించాడు. దాని ప్రకారం మణిరత్నం ఈ ప్రాజెక్ట్‌కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్‌ను తీసుకోబోతున్నాడట. మూడు దశాబ్దాలుగా మణిరత్నం ఎక్కువగా ఎ.ఆర్. రెహ్మాన్‌తోనే కలసి పని చేశాడు. ఇప్పుడు సంగీతంలో సరికొత్త ప్రయోగాలు చేయాలని ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ లో అభ్యంకర్‌ పేరు వినిపిస్తున్నప్పటికి రెహమాన్ నే ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

డాన్సింగ్ సెన్సేషన్ సాయి పల్లవి ఈ రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. షూటింగ్ సమ్మర్‌లో మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఈ సూపర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.‌

Read Also: కీర్తి సురేశ్ యూ టర్న్!

Read Also: చివరి వరకూ సీట్లోనే కూర్చోండి!

Updated Date - Mar 18 , 2026 | 04:12 PM