సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Sethupathi: జైలర్ 2.. బాలయ్య ప్లేస్ లో విజయ్

ABN, Publish Date - Jan 15 , 2026 | 04:02 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్ (Jailer).

Vijay Sethupathi

Vijay Sethupathi: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్ (Jailer). ఈ సినిమా 2023 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. రజినీ కెరీర్ లో బిగ్గెస్ట్ కలక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా తరువాత రజినీ నుంచి వచ్చిన ఏ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ రజినీ హిట్ కోసం నెల్సన్ వద్దకే వచ్చి చేరాడు. జైలర్ కి సీక్వెల్ గా నెల్సన్ జైలర్ 2 ను మొదలుపెట్టిన విషయం తెల్సిందే.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న జైలర్ 2 ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఇక జైలర్ లో మోహన్ లాల్, శివన్న క్యామియోస్ ఏ రేంజ్ గా వర్క్ అవుట్ అయ్యాయో అందరికీ తెల్సిందే. దీంతో ఈ సీక్వెల్ లో కూడా నెల్సన్ అలాంటి క్యామియోస్ నే దింపుతున్నాడు. మొదట నందమూరి బాలకృష్ణ ఒక క్యామియోలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ, అదేమీ లేదని క్లారిటీ వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ నటుడు మిథున్ చక్రవర్తి అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఇక నందమూరి బాలకృష్ణ ప్లేస్ ను కోలీవుడ్ స్టార్ హీరో విజ్జయి సేతుపతి రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సైతం ఒక అతిధి పాత్రలో మెరవనున్నట్లు ఆయనే స్వయంగా తెలిపాడు. ఒక ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ' నాకు రజినీ సార్ అంటే చాలా ఇష్టం. ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. జైల్లర్ 2 లో నేను ఒక అతిధి పాత్రలో నటిస్తున్నాను. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో, నాకు థ్రిల్ ఇచ్చే సినిమాల్లో విలన్ గా, అతిధిగా నటిస్తున్నాను. కథను మలుపు తిప్పే పాత్రలోనే కనిపిస్తాను. ప్రస్తుతం కథలు వింటున్నాను. అన్ని విలన్ పాత్రలే వస్తున్నాయి. త్వరలోనే మంచి సినిమాలతో వస్తాను' అని చెప్పుకొచ్చాడు. మరి జైలర్ 2 తో రజినీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jan 15 , 2026 | 04:02 PM