సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Sethupathi: ఇప్పటివరకు.. 2 లక్షల మందికి ఉపాధి కల్పించా

ABN, Publish Date - Nov 29 , 2026 | 11:54 AM

రాజకీయాలు ఆశ కాదు.. ప్రజలకు చేసే బృహత్తర సేవ అని నటుడు విజయ్ సేతుపతి అన్నారు.

Vijay Sethupathi

రాజకీయాలు అంటే కేవలం అధికారం, పదవుల కోసమేనా? లేక ప్రజలకు సేవ చేసే ఓ గొప్ప వేదికనా? ఈ అంశంపై ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి తనదైన శైలిలో స్పందించారు. రాజకీయాలను తాను ఎలా చూస్తానో చెబుతూనే.. సీఎం విజయ్‌తో తనకున్న పరిచయం, సమాజానికి తన వంతుగా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పటివరకు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు.

రాజకీయాలు ఆశ కాదని అది ఒక బృహత్తర సేవా కార్యక్రమం అని ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అన్నారు. ఆయన తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 'సీఎం విజయ్ (Cm Vijay) నాకు ఒక నటుడిగానే తెలుసు. ఆయనతో కలిసి పని చేశా.

రాజకీయాలు అనేవి ఆయన సిద్ధాంతాలు, అమలు చేసే పథకాలు, పరిపాలన తదితర అంశాలకు సంబంధించినవి. వీటికి అతీతంగా రాజకీయాలను సునిశితంగా గమనించడం అనేది నా పని కాదు. నాకు చాలా పనులున్నాయి. అదే సమయంలో రాజకీయాలు అనేవి ఆశ కాదు. ఒక బృహత్తర సేవా కార్యక్రమం. ఈ విషయాన్ని గతంలో అనేకమార్లు చెప్పా. నేను ఏం చేయగలనో దాన్ని చేస్తున్నా.

ఇప్పటివరకు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించా. సొంతూరిలో కొనేరు పూడిక తీత పనులు చేయిస్తున్నా. అనేక మందిని చదివిస్తున్నా. ఇది కూడా ఒక రకంగా రాజకీయమే. నేను సంపాదిస్తున్నా. ఆ డబ్బుతో ప్రజలకు నాకు తోచిన విధంగా సాయం చేస్తున్నా. ఇది ఎంతో తృప్తిగా ఉంది' అని పేర్కొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 11:54 AM