సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jananayagan: విజయ్ మ్యాజిక్‌తోనే సాధ్యమైంది..

ABN, Publish Date - Jul 31 , 2026 | 11:31 AM

అగ్ర హీరో విజయ్‌ నటించిన చిత్రం ఘన విజయం సాధించడానికి ఆయన మ్యాజిక్కే ప్రధాన కారణమని  చిత్ర నిర్మాత వెంకట్‌ కె.నారాయణ అన్నారు.

అగ్ర హీరో విజయ్‌ (Vijay) నటించిన చిత్రం ఘన విజయం సాధించడానికి ఆయన మ్యాజిక్కే ప్రధాన కారణమని  చిత్ర నిర్మాత వెంకట్‌ కె.నారాయణ (KVN) అన్నారు. ఈ నెల 23న విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకుని ఇప్పటికే రూ.250 కోట్లకుపైగా వసూలు సాధించి, ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సక్సెస్ పై  నిర్మాత వెంకట్‌ కె.నారాయణ మాట్లాడుతూ, ‘విజయ్‌ నటించే చివరి చిత్రం కావడంతో దాన్ని అభిమానులు ఎంతగానో ఎంజాయ్‌ చేసేలా నిర్మించడమే మా అందరి లక్ష్యంగా ఉన్నది. చిత్ర నిర్మాణం ఎంతో సులభంగా జరిగిపోయింది. కానీ, విడుదలకు అనేక అడ్డంకులు ఏర్పడటంతో అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయాం. ముఖ్యంగా ఏప్రిల్‌లో సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఇది అతిపెద్ద సవాల్‌గా మారింది. విజయ్‌ చివరి చిత్రంగా ఉన్న ‘జన నాయగన్‌’ ఇటు విజయంపరంగా, అటు వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయిక, మమిత బైజు కీలకపాత్రలో కనిపించారు. 

ఇవి కూడా చదవండి:

సైమా 14వ ఎడిషన్‌ నామినేషన్స్‌లో ఈ తెలుగు చిత్రాలదే హవా..

మహేష్ సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది: సుమంత్

యంగ్ టైగర్ వదిలిన ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Updated Date - Jul 31 , 2026 | 12:12 PM