Trisha: ఆస్ట్రేలియా వెకేషన్‌లో త్రిష.. ఒక్క క్యాప్షన్‌తో మొదలైన చర్చ

ABN , Publish Date - Jul 30 , 2026 | 03:23 PM

స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది.

స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వెకేషన్‌ను ఆస్వాదిస్తున్న ఆమె, అక్కడి అందమైన లొకేషన్లలో దిగిన స్టైలిష్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలకు జత చేసిన క్యాప్షన్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 'ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండటం కూడా ఒక ఛాయిస్.. ఆ ఛాయిస్‌ను ఎంచుకోండి' అంటూ త్రిష తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఇటీవల కొంతకాలంగా తమిళనాడు రాజకీయాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె పేరు వివిధ ప్రచారాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. 

ముఖ్యంగా తమిళనాడు సీఎం విజయ్‌తో త్రిష రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు, విమర్శల నేపథ్యంలోనే ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి రూమర్స్ వచ్చినా వాటిని పట్టించుకోకుండా ప్రశాంతంగా తన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని త్రిష ఈ క్యాప్షన్ ద్వారా పరోక్షంగా చెప్పినట్టుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే త్రిష మాత్రం ఈ వ్యాఖ్యలను ఎక్కడా ప్రస్తావించలేదు. ఏ విమర్శపైన ఆమె నేరుగా స్పందించలేదు. 

ALSO READ:
Lenin Movie: నిన్న చైతు, ఇవాళ అఖిల్... మిగిలింది నాగార్జునే!

Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ

MSVP: శంకర ప్రసాద్ గారి ఖాతాలో మరో రికార్డు



Updated Date - Jul 30 , 2026 | 04:10 PM