Anasuya Bharadwaj: దిగొచ్చిన అన‌సూయ‌.. శివాజీ క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చారు! కానీ

ABN , Publish Date - Jan 08 , 2026 | 01:03 PM

న‌టుడు శివాజీ (Shivaji) చేసిన వ్యాఖ్య‌లు ఎంత దుమారం రేపి ఎక్క‌డి వ‌ర‌కు వెళ్లాయో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

Anasuya Bharadwaj

'దండోరా' ప్రీ-రిలీజ్ వేడుక సంద‌ర్భంగా న‌టుడు శివాజీ (Shivaji) చేసిన వ్యాఖ్య‌లు ఎంత దుమారం రేపి ఎక్క‌డి వ‌ర‌కు వెళ్లాయో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఈ ఇష్యూలో అన‌సూయ‌, చిన్మ‌యి, నాగ‌బాబు వంటి వారు ఇన్‌వాల్వ్ కావ‌డంతో సమస్య మ‌రింత పెద్ద‌గా అయి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆడ మ‌గా అనే తేడా లేకుండా శివాజీకి వ‌న్‌సైడ్‌గా మ‌ద్ద‌తు తెలిపారు. అంతేగాక ఇష్యూ ప‌క్క‌దోవ ప‌ట్టి అన‌సూయ వ‌ర్సెస్ శివాజీ అనే ప‌రిస్థితి నెలకొంది.

ఈ క్ర‌మంలో అన‌సూయ (Anasuya Bharadwaj) పై మ‌రింత‌గా ట్రోలింగ్ సైతం జ‌రిగింది. అయినా అన‌సూయ ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గక‌ డైరెక్ట్ గా స్పందించ‌కున్నా నా అభిప్రాయం మీద నేనున్నా అని అర్థం వ‌చ్చేలా ఫొటోలు, వీడియోలు పెడుతూ ప‌బ్లిక్ దృష్టిలో మ‌రింత‌ యాంటీగా మారిపోయారు. ఈ నేప‌థ్యంలో స‌మ‌స్య ప్రారంభం అయిన ప‌ది హేను రోజుల త‌ర్వాత ఇప్పుడు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఓ అభిమాని శివాజీ మాట్లాడిన‌ దాంట్లో త‌ప్పేముంది రెండు మాట‌లు త‌ప్ప.. ఈ ఇష్యూలో మీ అభిప్రాయం ఏంటి? అని అడిగిన ప్ర‌శ్న‌కు అన‌సూయ జ‌వాబు ఇచ్చింది.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'శివాజీ గారు ఎంతో కష్ట‌ప‌డి ఎదిగి ఇప్పుడు ప‌ది మందికి చెప్పే స్థాయికి వ‌చ్చారు. ఆయ‌న ఈవెంట్‌లో చెప్పిన మాట‌ల ఉద్దేశం మంచిదే కానీ ఆయ‌న‌ అమ్మాయిలకే కాక అబ్బాయిల‌కు కూడా వారి బాధ్య‌త‌లు గుర్తు చేసేలా మాట్లాడి ఉంటే బాగుండేద‌'ని తెలిపింది. ఇందుకు సంబంధించి అన‌సూయ మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతోంది. ఆ వీడియో ను మీరూ చూసేయండి!

Updated Date - Jan 08 , 2026 | 02:34 PM