Tollywood: వినాయక చవితికి ఆసక్తికర పోరు!
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:56 PM
విజయ్ దేవరకొండ 'రణబాలి'తో కార్తీ 'సర్దార్ 2' చిత్రం పోటీ పడబోతోంది. వినాయక చవితి సీజన్‌లో ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌తో విడుదల కాబోతున్నాయి.
ఈ యేడాది వినాయక చవితి సీజన్ లో బాక్సాఫీస్ బరిలో ఆసక్తికర పోటీ చోటు చేసుకుంటోంది. ఇప్పటికే వినాయక చవితి కానుకగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) నటిస్తున్న 'రణబాలి' (Ranabaali) ని సెప్టెంబర్ 11న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే తాజాగా దానికి ఒకరోజు ముందు కార్తీ నటిస్తున్న 'సర్దార్ 2' (Sardar 2)ను రిలీజ్ చేయనున్నట్టు దాని నిర్మాతలు ప్రకటించారు.
కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'సర్దార్' సినిమా 2022లో దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పారు. అయితే రకరకాల కారణాలతో అది సెట్స్ పైకి వెళ్లడం లేటైంది. మొత్తానికి ఇప్పుడీ సినిమా ఈ యేడాది వినాయక చవితికి రానుంది. తాజా సీక్వెల్ లో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే ఎస్.జె. సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లో 'సర్దార్ 2' తెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్. విజయ్ వేలుకుట్టి ఎడిటర్. ఎ.పి. పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?
పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..!
‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్
Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!