సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Sethupathi: 'స్లమ్‌ డాగ్', 'ట్రైన్' సంగతేమో కానీ 'బత్తా' రిలీజ్ డేట్‌ ఫిక్స్

ABN, Publish Date - Aug 12 , 2026 | 02:07 PM

విజయ్ సేతుపతి 'స్లమ్ డాగ్', 'ట్రైన్' చిత్రాల రిలీజ్‌ డేట్ ఇంకా ఫిక్స్ కాకముందే, అతని మరో సినిమా 'బత్తా' విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు.

Baththa Movie

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'స్లామ్ డాగ్' మూవీ చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. కాకపోతే ప్రమోషన్స్ మాత్రం ఇటీవలే జోరందుకున్నాయి. నిన్న కాక మొన్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న టబు కు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అతి త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

అలానే... విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించిన 'ట్రైన్' మూవీ సైతం విడుదలకు సిద్థమౌతోంది. నిజానికి ఈ సినిమా ఆగస్ట్ నెలాఖరుకు రావాల్సింది. ఇప్పుడు దీనిని సెప్టెంబర్ చివరకు పోస్ట్ పోన్ చేశారు. సో... ఆగస్ట్ నెలాఖరుకు 'స్లమ్ డాగ్'ను పూరి జగన్నాథ్ రిలీజ్ చేయగలిగితే... సెప్టెంబర్ నెలాఖరుకు 'ట్రైన్' వస్తుంది. దాని వెనుకే ఇప్పుడు విజయ్ సేతుపతి మరో సినిమా 'బత్తా' రానుంది.


తాజాగా విజయ్‌ సేతుపతి హీరోగా అట్లీ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న 'బత్తా' సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నారు. గతంలో విజయ్ సేతుపతితో 'నడువుల కొంజం పక్కత కాణోమ్, సీతాకాతి' చిత్రాలను రూపొందించిన బాలాజీ తరణీధరన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీనిని అట్లీ తన సొంత బ్యానర్ 'ఏ ఫర్ యాపిల్ ప్రొడక్షన్'పై తీస్తున్నాడు. ప్రియా అట్లీ, మురాద్‌ ఖేతానీ, అలోక్ జైన్, అజిత్ అంధారే దీనికి నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన స్టార్ స్టూడియోస్, సినీ 1 స్టూడియోస్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. 'జై భీమ్‌' సినిమాలో కీలక పాత్ర పోషించిన లిజోమోల్ జోస్ ఇందులో ప్రధాన పాత్రధారిణి. ఇటీవల సౌతిండియాలో మ్యూజిక్ సెన్సేషన్ గా మారిన సాయి అభ్యంకర్ 'బత్తా' చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాంతో మూవీగా అంచనాలు బాగానే పెరిగాయి. 'బత్తా' కంటే ముందు వచ్చే పూరి జగన్నాథ్‌ 'స్లామ్ డాగ్', 'ట్రైన్' సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తే, 'బత్తా'పై క్రేజ్ మరింత పెరిగే ఆస్కారం ఉంది.

ఇవి కూడా చదవండి:

‘ఇప్పుడేం సమాధానం చెబుతారు? న‌టుడు గోవిందపై.. భార్య సునీత సంచలన వ్యాఖ్యలు!

చిరు లీక్స్.. మెగా 158 టైటిల్ ఇదే

హీరోగా మారుతున్న కేసీఆర్ మనవడు..

Updated Date - Aug 12 , 2026 | 02:23 PM