సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

KVN Productions: మూడు నెలలు... మూడు భాషలు... మూడు సినిమాలు!

ABN, Publish Date - Jul 07 , 2026 | 12:32 PM

విజయ్ 'జన నాయగన్' మూవీ ఈ నెల 23న విడుదల కాబోతోందని సమాచారం. అదే జరిగితే నిర్మాత వెంకట్ కె నారాయణ రేర్ ఫీట్‌ను సాధించినట్టు అవుతుంది.

Jana Nayagan Movie

కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే...' అనే పాట పాడుకుంటూ ఉండొచ్చు. గత కొంతకాలంగా ఆయన తెరకెక్కించిన సినిమాల విడుదల విషయంలో అనేకానేక సమస్యలు ఎదురయ్యాయి. ఎప్పుడైతే తన 'జన నాయగన్' చిత్ర కథానాయకుడు విజయ్‌ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారో వెంకట్ నారాయణ దశ తిరిగిపోయింది. ఇప్పుడు ఆయన కేవలం నిర్మాత మాత్రమే కాదు... తమిళనాడు తరఫున న్యూఢిల్లీలో ప్రతినిధిగా ఉన్నారు. అలానే తాజాగా 'జన నాయగన్' మూవీని చూసిన సెన్సార్ రివైజింగ్‌ కమిటీ 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చిందని సమాచారం. దాంతో ఈ సినిమాను ఇదే నెల 23న విడుదల చేయడానికి వెంకట్ నారాయణ రంగాన్ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అలానే వెంకట్ నారాయణ నిర్మించిన మరో ప్రతిష్ఠాత్మక చిత్రం 'టాక్సిక్'ను ఆగస్ట్ 26న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే... కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నుండి వరుసగా మూడు నెలల్లో మూడు భాషల్లో మూడు సినిమాలు వచ్చినట్టవుతుంది.


జూన్ 19న వెంకట్ నారాయణ నిర్మించిన మలయాళ చిత్రం 'బాలన్: ది బాయ్' సినిమా విడుదలైంది. ఇప్పటికీ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు మంచి ఆదరణే లభించింది. ఇక జూలై 23న తమిళ చిత్రం 'జన నాయగన్‌' విడుదల కాబోతోంది. అలానే ఆగస్ట్ 26న కన్నడ చిత్రం 'టాక్సిక్‌' వస్తోంది. ఇలా ఒకే నిర్మాణ సంస్థకు చెందిన మూడు భాషా చిత్రాలు నెలకు ఒకటి చొప్పున బ్యాక్‌ టు బ్యాక్‌ రావడం విశేషమే.

ఇవి కూడా చదవండి:

పాలిటిక్స్‌లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా?

అక్కినేని వారబ్బాయికి.. నందమూరి వారసుని 'మాట సాయం'!

దివ్యభారతి గ్లామర్ ట్రీట్‌కు కుర్రకారు ఫిదా.. ఫొటోలు వైరల్

Updated Date - Jul 07 , 2026 | 12:38 PM