సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జయలలిత పాత్రలో త్రిష? ఎంజీఆర్ బయోపిక్‌లో వాస్తవాలు చూపిస్తారా?

ABN, Publish Date - Oct 30 , 2026 | 07:13 PM

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే. సినిమా గ్లామర్, రాజకీయ అధికారం కలగలిసిన గడ్డ అది. తాజాగా కోలీవుడ్‌లో ఓ సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది.

Trisha and Jayalalitha

తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) ఎప్పుడూ రసవత్తరమే. సినిమా గ్లామర్, రాజకీయ అధికారం కలగలిసిన గడ్డ అది. అయితే ఇటీవల నటుడు, స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడం, ఫస్ట్ పోటీలోనే గెలిచి, అధికారం చేజిక్కించుకోవడం తమిళనాట సంచలనంగా మారిన విషయం తెలియంది కాదు. అదే టైమ్‌లో.. హీరోయిన్ త్రిష (Trisha) పేరు కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో భారీగా చక్కర్లు కొడుతూ వస్తోంది. ఇదిలా ఉండగానే, ఇప్పుడు కోలీవుడ్‌లో అంతకుమించిన మరో సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేమిటంటే.. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రజలు అమ్మ అని పిలుచుకునే లెజెండరీ నాయకురాలు జయలలిత (Jayalalithaa) పాత్రలో త్రిష నటించబోతోందన్న వార్త సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌గా మారింది.


అసలు ఈ ప్రచారం ఎక్కడి నుంచి మొదలైంది..? తమిళ రాజకీయాలను, సినీ రంగాన్ని శాసించిన దేవుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవితకథ ఆధారంగా ‘పురచ్చి తలైవర్ ఎంజీఆర్’ (Puratchi Thalaivar MGR) అనే భారీ బయోపిక్ తెరకెక్కుతోంది. ఎంజీఆర్ సినీ ప్రస్థానం నుంచి ఆయన రాజకీయ విప్లవం వరకు.. ఆయన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి జయలలిత. వీరిద్దరిది వెండితెరపై సూపర్ హిట్ జోడీ మాత్రమే కాదు, తమిళ రాజకీయ చరిత్రను తిరగరాసిన బంధం. ఈ సినిమాలో జయలలిత పాత్ర అత్యంత కీలకం కానుంది. అందుకే మేకర్స్ ఈ పవర్‌ఫుల్ పాత్ర కోసం స్టార్ నటి త్రిషను సంప్రదించినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. జయలలిత పాత్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వెండితెరను ఏలిన అందం, గంభీరమైన గొంతు, ఎవరికీ తలవంచని ఆత్మవిశ్వాసం, అడుగడుగునా ఎదురైన రాజకీయ కుట్రలను ఎదుర్కొన్న ధైర్యం... ఇవన్నీ చూపించగలగాలి. పొన్నియిన్ సెల్వన్‌లో కుందవై పాత్రతో రాచరికపు ఠీవిని, గంభీరతను అద్భుతంగా పండించి మెప్పించిన త్రిష.. జయలలిత పాత్రకు సరైన ఛాయిస్ అని ఆమె అభిమానులు భావిస్తున్నారు. త్రిష ప్రస్తుతం కెరీర్‌ పరంగా సూపర్ ఫామ్‌లో ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మరోవైపు, ఆమెకు పొలిటికల్‌గానూ రేంజ్ మారే అవకాశం లేకపోలేదు. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


నిజానికి జయలలిత బయోపిక్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తలైవి పేరుతో జయలలిత పాత్రను పోషించింది. కంగనా తన నటనతో ప్రశంసలు అందుకున్నప్పటికీ, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సినిమాగా కంటే డాక్యుమెంటరీగా మారిందన్న విమర్శలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రను దర్శకుడు ఎలా ఆవిష్కరిస్తాడు..? సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారా లేక వాస్తవాలను యథాతథంగా చూపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాట ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే త్రిష.. నిజంగానే అమ్మ జయలలిత పాత్రలో నటిస్తే థియేటర్లలో ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడమే థ్రిల్లింగ్‌గా ఉంది. చూద్దాం.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో..

ఇవి కూడా చదవండి:

రెండు పార్ట్‌లుగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా? మరో ‘కింగ్‌డమ్’ కాదు కదా..

Megaverse: ఒకే స్టేజ్‌పై చిరు, పవన్, చరణ్.. మెగావర్స్‌లో మెగా ట్రీట్

సీనియర్ నటి, ‘అదుర్స్’ ఎన్టీఆర్ బామ్మ కన్నుమూత

Updated Date - Oct 30 , 2026 | 07:13 PM