సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తమిళ సినిమాలో విలన్‌గా తరుణ్‌ భాస్కర్‌..

ABN, Publish Date - Nov 05 , 2026 | 04:21 PM

దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ నటుడిగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించనున్నాడు. అశ్వత్‌ మారిముత్తు స్థానంలో ఈ అవకాశం తరుణ్‌ భాస్కర్‌కు దక్కింది.

Tarun Bhascker

తొలి చిత్రం 'పెళ్ళిచూపులు'తో అటు ప్రభుత్వ అవార్డులు, ఇటు ప్రేక్షకుల రివార్డులు అందుకున్నాడు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. అయితే అతనిలో ఓ మంచి నటుడు కూడా ఉన్నాడని ఇప్పుడిప్పుడే జనం నమ్ముతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన తరుణ్‌ భాస్కర్‌... కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించాడు. కానీ దర్శకుడిగా వచ్చిన పేరు అతనికి హీరోగా దక్కలేదు. అయినా అడిగిన వారికి 'నో' చెప్పకుండా పాత్ర ఏ మాత్రం నచ్చినా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాడు. అది కూడా నటుడిగా అతని కెరీర్‌కు కొంత మైనస్‌ అయ్యిందనే వారూ ఉన్నారు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన రెండో సినిమా 'ఈ నగరానికేమైంది?' కమర్షియల్‌గా గొప్ప విజయాన్ని సాధించకపోయినా... దర్శకుడిగా అతనికి యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఇప్పుడు దాని సీక్వెల్‌ గా తెరకెక్కిన 'ఈఎన్ఈ రిపీట్‌' మూవీ నవంబర్ 19న విడుదల కాబోతోంది.


ఇదిలా ఉంటే ఇప్పుడు తరుణ్‌ భాస్కర్‌ నటుడిగా తమిళ చిత్రసీమలోకి అడుగు పెడుతున్నాడు. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ కాగా ఇతర ప్రధాన పాత్రలను శివాజీ, శ్వాసిక, అనామి్ మహీ పోషిస్తున్నారు. తరుణ్‌ భాస్కర్‌ చేయాల్సిన ఈ పాత్రకు మొదట దర్శక, నటుడు అశ్వత్‌ మారిముత్తును ఎంపిక చేశారు. కానీ అతను రజనీకాంత్‌ సినిమా 'ధర్మన్'తో బిజీగా ఉండటంతో డేట్స్ క్లాష్‌ వల్ల ఈ అవకాశం తరుణ్‌ భాస్కర్‌కు లభించింది. ఇందులో తరుణ్‌ భాస్కర్‌ ప్రతినాయకుడి పాత్ర చేయబోతున్నాడు. విశేషం ఏమంటే.. గతంలో అశ్వత్‌ మారిముత్తు తెరకెక్కించిన 'ఓ మై కడవులే' సినిమా తెలుగు రీమేక్‌ 'ఓరి దేవుడా'కు తరుణ్‌ భాస్కర్‌ మాటలు రాశారు. ఇప్పుడు ఏకంగా అశ్వత్‌ మారిముత్తు పోషించాల్సిన పాత్రనే తరుణ్‌ చేయబోతున్నాడు. ఈ సినిమాను 'ది ఆల్ఫా యూనిట్‌' పేరుతో ఆరుగురు యువకులు డైరెక్ట్ చేస్తున్నారు. దీనికి హీరో ప్రదీప్ రంగనాథన్‌ కథను అందించగా, సాయి అభ్యంకర్‌ సంగీతం సమకూర్చుతున్నాడు.

ఇవి కూడా చదవండి:

సినిమా రివ్యూ: రామాయణం

చిరంజీవి అమెరికా టూర్.. ‘కాకా’ ఫస్ట్ సాంగ్‌పై థమన్ అదిరిపోయే అప్‌డేట్!

DADA: క్రిస్మస్ రేస్ నుంచి.. బాలయ్య ఔట్?

Updated Date - Nov 05 , 2026 | 04:24 PM