రెమ్యూనరేషన్ ఇవ్వలేదు.. కోర్టుకెక్కిన స్టార్ లేడీ డైరెక్టర్
ABN, Publish Date - Jun 30 , 2026 | 05:19 PM
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan), శ్రీలీల(Sreeleela) ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ సుధా కొంగర(Sudha Kongara) తెరకెక్కించిన భారీ చిత్రం పరాశక్తి (Parasakthi).
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan), శ్రీలీల(Sreeleela) ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ సుధా కొంగర(Sudha Kongara) తెరకెక్కించిన భారీ చిత్రం పరాశక్తి (Parasakthi). ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్న విషయం తెల్సిందే. వివాదాల మధ్య విడుదల కావడం, ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం.. ఇలా ఈ సినిమా పరాజయం పాలవ్వడానికి కారణాలుగా నిలిచాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 5 నెలల తరువాత డైరెక్టర్ సుధా కొంగర మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
పరాశక్తి సినిమాను నిర్మించిన డాన్ పిక్చర్స్ సంస్థ తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ బ్యాలెన్స్ పూర్తిగా చెల్లించలేదంటూ సుధా కొంగర ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ యాక్ట్ కింద కోర్టును ఆశ్రయించారు. తన ఒప్పందం ప్రకారం రావాల్సిన రూ. 8.39 కోట్ల బకాయిలను ఇప్పించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా డైరెక్షన్ కోసం సుధా కొంగర పారితోషికం రూ. 15 కోట్లుగా ఫిక్స్ కాగా, జిఎస్‌టి తో కలుపుకుని మొత్తం రూ. 17.70 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు ప్రొడక్షన్ హౌస్ ఆమెకు కేవలం రూ. 9.31 కోట్లు మాత్రమే చెల్లించిందని, మిగిలిన రూ. 8.39 కోట్లను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని సుధా కొంగర తరపు లాయర్లు వాదించారు.
సినిమాకు సంబంధించిన అన్నీ హక్కులను నిర్మాతలకు బదిలీ చేసినప్పటికీ, తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా అదే బ్యానర్ లో వస్తున్న తదుపరి చిత్రం ఇదయం మురళిని జూలై 10న రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు జస్టిస్ కుమార్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూలై 8వ తేదీ వరకు పరాశక్తి సినిమా శాటిలైట్ హక్కుల లావాదేవీలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి సినిమా విడుదలను ఆపడంపై జూలై 7 లోగా కౌంటర్ దాఖలు చేయాలని నిర్మాతలను ఆదేశించారు.
ఇక నిర్మాతల వెర్షన్ వేరుగా ఉన్నట్లు సమాచారం. సుధా కొంగర సినిమా మొదలుపెట్టినప్పుడు రెమ్యూనరేషన్ అని చెప్పలేదని, లాభాల్లో వాటా అడిగిందని, ఇప్పుడు సినిమా నష్టపోయిన తరువాత తన డబ్బు కావాలని అంటున్నట్లు తెలిపారు. అంత మొత్తం ఇవ్వలేమని, కొంచెం తగ్గిస్తే ఇస్తామని తెలిపినట్లు తెలుస్తోంది. మరి సుధా కొంగర.. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి :
డెలివరీ బాయ్ తో గొడవ.. అఖిల్ రాజ్ వాదన ఏంటి
Prabhas Vs Balakrishna: డిసెంబర్‌లో.. ప్రభాస్, బాలయ్య ఢీ అంటే ఢీ
Pralay: రణ్‌వీర్‌సింగ్ రెడీ.. ఆస్ట్రేలియాలో షురూ..