‘అశ్విన్స్’ ఫేమ్ తరుణ్ తేజతో శ్రుతీహాసన్ కొత్త సినిమా!

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:43 PM

శాంతి టాకీస్ బ్యానర్‌పై శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో కొత్త సినిమా తెరకెక్కనుంది. ‘అశ్విన్స్’ ఫేమ్ తరుణ్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

Shruti Haasan New movie

విభిన్నమైన కథలు, క్వాలిటీ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న నిర్మాణ సంస్థ శాంతి టాకీస్. తాజా ఈ సంస్థ కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించింది. అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించనున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’తో గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ తేజ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. శివ కార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మావీరన్’, సిద్ధార్థ్ హీరోగా శ్రీగణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘3బీహెచ్‌కే’ వంటి సినిమాలతో శాంతి టాకీస్ విభిన్నమైన కథలను, కొత్త తరహా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది.


తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి హాసన్, విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి పెర్ఫార్మర్‌గా పేరు తెచ్చుకున్నారు. నటనతో పాటు సింగర్‌గా, మ్యూజీషియన్‌గా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రతి సినిమాలో తనదైన ప్రత్యేకతను చూపించే శ్రుతి హాసన్, శాంతి టాకీస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ కొత్త తమిళ సినిమాలో లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన 'ఆకాశంలో ఒక తార' సినిమాలో శ్రుతి హాసన్ పోషించిన రోహిణి పాత్రకు మంచి గుర్తింపు లభించింది. లేడీ ఎంటర్ పెన్యూర్‌గా ఆమె ఈ సినిమాలో చక్కని భావోద్వేగాలను పలికించి మెప్పించింది.


గతంలో వసంత్ రవి హీరోగా నటించిన ‘అశ్విన్స్’ సినిమాకు తరుణ్ తేజ దర్శకత్వం వహించారు. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా విభిన్నమైన కథనం, ఆకట్టుకునే విజువల్స్, అద్భుతమైన సౌండ్ డిజైన్‌తో తెరకెక్కింది. ఇప్పుడు ఈ కొత్త సినిమాతో తరుణ్ తేజ మరో ఆసక్తికరమైన కథను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు. తనదైన దర్శకత్వ శైలికి శ్రుతి హాసన్ నటన తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌తో శాంతి టాకీస్ మరో కొత్త జానర్‌ను టచ్ చేస్తూ, విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్, కథాంశం, షూటింగ్ షెడ్యూల్ వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.

ALSO READ:

‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లేకుండానే.. నాని రియాక్షన్ ఇదే

సూర్య ‘సీన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

RC17: రామ్ చరణ్ సరసన ఆ ‘తార’ ఫిక్స్ అయినట్టేనా?

Updated Date - Nov 24 , 2026 | 07:00 PM