రాఘవ లారెన్స్‌ ప్రకటన వాయిదా.. కారణమిదే

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:06 PM

జూన్ 11వ తేదీన తన జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నట్లుగా రాఘవ లారెన్స్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోజు ప్రకటన చేయడం లేదని తెలుపుతూ.. ఎప్పుడో చేయబోతున్నారో కూడా తెలిపారు.

Raghava Lawrence

భారతీరాజా (Bharathiraja) మృతికి గౌరవార్థం నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స (Raghava Lawrence) తన అనౌన్స్‌మెంట్‌ను వాయిదా వేస్తున్నట్లుగా పోస్ట్ చేశారు. ఇంతకు ముందు జూన్ 11వ తేదీన తన జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నట్లుగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తిరుచ్చి ఈస్ట్‌ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో రాఘవ లారెన్స్‌ పోటీ చేయనున్నారంటూ (contesting in Trichy East election) ప్రచారం జోరుగా సాగుతోన్న వేళ, ఆయన చేసిన ఈ పోస్ట్‌తో అంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. కానీ, ఈ ప్రకటను వాయిదా వేస్తూ.. ఎప్పుడు ఆయన ప్రకటించనున్నారో కూడా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్‌లో..


‘‘అందరికీ నమస్కారం, ఈ గురువారం, 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు నా జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు నేను ఇంతకుముందు మీకు తెలియజేశాను. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా భారతీరాజా సార్ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నేను నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధతో ఉన్నాను. భారతీరాజా సార్ పై ఉన్న గౌరవంతో, సినిమాకు ఆయన అందించిన సహకారానికి గుర్తుగా, నేను నా ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాను. నా ఈ ప్రకటనను శుక్రవారం, 12వ తేదీ ఉదయం 10:00 గంటలకు తెలియజేస్తాను’’ అని లారెన్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


అంతకు ముందు ఓ వేదికపై తమిళనాడు సీఎం విజయ్‌ (Tamil Nadu CM Vijay)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో తనకు ఉన్న ఒకే ఒక్క స్నేహితుడు విజయ్‌ మాత్రమేనని ఆయన వెల్లడించారు. ‘‘చిత్రపరిశ్రమలో నాకు పెద్దగా స్నేహితులు ఎవరూ లేరు. స్నేహితుడు అని చెప్పుకునే వ్యక్తి విజయ్‌ సర్‌ మాత్రమే. నా జీవితంలో జరిగే మంచి చెడు ఏది జరిగినా మొట్టమొదట ఫోన్‌ చేసి విచారించేది ఆయనే. నాకు చిన్న గాయం తగిలినా ఎంతో ప్రేమతో ‘ఎన్న నన్బా.. ఎన్నాచ్చి’ అంటూ ఆప్యాయంగా అడుగుతారు’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే రాఘవ లారెన్స్‌ టీవీకేలో చేరి తిరుచ్చి ఈస్ట్‌ బైపోల్‌లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్‌కి కారణమిదే: ఏడిద రాజా

భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి

‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!

బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్

Updated Date - Jun 10 , 2026 | 01:06 PM